Begin typing your search above and press return to search.

విజయ్‌ దేవరకొండ అందుకు ఒప్పుకుంటాడా..?

By:  Tupaki Desk   |   26 Dec 2018 7:00 AM IST
విజయ్‌ దేవరకొండ అందుకు ఒప్పుకుంటాడా..?
X
అర్జున్‌ రెడ్డి సినిమా ఏ టైమ్‌ లో చేశాడో కానీ అప్పటినుంచి విజయ్‌ దేవరకొండకు అదృష్టం ఓ రేంజ్‌ లో పట్టింది. గీతగోవిందం- టాక్సీవాలా సినిమాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌ ఇచ్చాడు. మధ్యలో ఫ్లాపులు లేవా అంటే.. ఉన్నా వాటి సంగతి అసలు జనానికే గుర్తుకులేదు.

తెలుగులో మాంచి ఫామ్‌ లో యూత్‌ ఐకాన్‌ గా దూసుకుపోతున్న విజయ్‌ దేవరకొండ పై ఇప్పుడు బాలీవుడ్‌ కన్ను పడింది. కరణ్‌ జోహార్‌ ధర్మా ప్రొడక్షన్స్‌, ప్రతిష్టాత్మక యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ విజయతో సినిమాలు చేసేందుకు ప్లాన్స్‌ రెడీ చేసుకుంటున్నాయి. అయితే.. ఈ రెండు సినిమాల్ని కాదని.. 1983 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో వచ్చే సినిమాలో ఓ చిన్న కేరక్టర్‌ త్‌ విజయ్‌ హిందీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఎందుకంటే.. బాలీవుడ్‌ లో ధర్మా ప్రొడక్షన్స్‌ పెద్ద బ్యానర్‌. ఇక యశ్‌ రాజ్‌ గురించి చెప్పాల్సిన పనిలేదు.

మన దగ్గర సురేశ్‌ ప్రొడక్షన్స్‌ లా అన్నమాట. ఈ రెంటిలో ఏదైనా బ్యానర్‌ లో అవకాశం వస్తే ఏ హీరో అయినా ఎగిరి గంతేస్తాడు తప్ప.. పోయి పోయి ఓ చిన్న సినిమాలో ఇంకా చిన్న కేరక్టర్‌ లో నటించడు. ఇలాంటి విషయాల్లో విజయ్‌ పేద్ద దేశముదురు. ఆచితూచి అడుగులు వేయడంలో దిట్ట. బాలీవుడ్‌ ఎంట్రీ విషయంలో మనోడికి చాలా క్లారిటీ ఉంది. అందుకే.. లేటైనా సరే లేటెస్ట్‌ గా ఎంట్రీ ఇవ్వాలని… ధర్మా, యశ్‌ రాజ్‌ బ్యానర్స్‌ తో టట్‌ లో ఉన్నాడు.