Begin typing your search above and press return to search.

కంగన కంటే ముందే విద్యా బాలన్

By:  Tupaki Desk   |   20 April 2019 11:43 AM IST
కంగన కంటే ముందే విద్యా బాలన్
X
బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటనకు ఫిదా కానివారు దాదాపుగా ఎవరూ ఉండరు. విద్యా మొదటి నుంచి సినిమాల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా ఉండేది. తను నటించే కథలలలో.. పాత్రలలో వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడేది. అందుకే విద్య దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించింది. ఈమధ్య ఎన్టీఆర్ బయోపిక్ లో విద్యా బసవతారకం పాత్రలో నటనకు భారీగా ప్రశంసలు అందుకున్న విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే విద్య ఈమధ్య ఒక క్రేజీ ప్రాజెక్టుకు నో చెప్పిందనే టాక్ వినిపిస్తోంది.

జయలలత బయోపిక్ 'తలైవి' లో టైటిల్ రోల్ కోసం మొదట విద్యానే సంప్రదించారట. మొదట సినిమాలో నటించేందుకు అంగీకారం తెలిపిందని.. కాకపోతే తర్వాత తనకున్న ఇతర కమిట్మెంట్ల కారణంగా చేయలేకపోతున్నానని ప్రాజెక్టునుండి డ్రాప్ అయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అసలు కారణం అది కాదట. విద్య హిందీలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితంపై తెరకెక్కే బయోపిక్ లో నటిస్తోందట. ఈ చిత్రంలో ఇందిరా గాంధి పాత్రను పోషిస్తోంది విద్య. ఒకేసారి రెండు బయోపిక్స్ లో నటించడం ఎందుకని జయలలిత బయోపిక్ కు నో చెప్పిందట. "ఒక బయోపిక్ చాలు అనుకున్నాను" అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించింది విద్య.

'తలైవి'కి విద్యా నో చెప్పిన తర్వాతే ఆ ఆఫర్ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు వచ్చిందట. ఏదైతేనేం.. కంగనా కూడా అద్భుతమైన నటే.. విద్య కంటే పెద్ద స్టార్ కానీ.. కాస్త నోటి దురుసు. అంతే. అయినా ఈ క్రేజీ సోషల్ మీడియా జెనరేషన్లో సినిమాపై హైప్ పెంచడానికి అదే భేషుగ్గా ఉపయోగపడుతోంది. మనలోని మైనస్ ను కూడా గట్టిగా వాడుకుని ప్లస్ మార్చుకోవడం అంటే అదే!