Begin typing your search above and press return to search.

'ది లెజెండ్' పాన్ ఇండియా వెనుక బిజినెస్ స్ట్రాటజీ !

By:  Tupaki Desk   |   3 Aug 2022 1:30 AM GMT
ది లెజెండ్ పాన్ ఇండియా వెనుక బిజినెస్ స్ట్రాటజీ !
X
త‌మిళ వ్యాపార వేత్త శ‌ర‌వ‌ణ‌న్ ఇటీవ‌లే 'లెజెండ్' సినిమాతో హీరోగా పరిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. సినిమా ఫ‌లితం సంగ‌తి ప‌క్క‌న‌బెడితే...ఇత‌రు హీరో? ఏంటి? అత‌ను హీరో మెటీరియ‌ల్ నా? పైగా 80 కోట్లు పెట్టి పాన్ ఇండియా సినిమానా? ఇత‌నికి ఏమైనా పిచ్చా? వెర్రా! అంటూ నెట్టింట పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఎదుర్కున్నాడు. ట్రోలింగ్ కి గుర‌య్యాడు.

మ‌రి ఈ సినిమా వెనుక బిజినెస్ స్ట్రాటజీ ఉందా? 'లెజెండ్' సినిమా చేయ‌డంలో శ‌ర‌వ‌ణ‌న్ బిజినెస్ ప్లాన్ దాగిందా? పిచ్చోడు అత‌ను కాదు..ట్రోల్ చేసిన వాళ్లు అని అంటారా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తుంది. శ‌ర‌వ‌ణ‌న్ ముందు పెద్ద స‌క్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్. ఆ త‌ర్వాత‌నే సినిమా న‌టుడైనా.. ఇంకేదైనా? సౌత్ లో శ‌ర‌ణ‌వ‌న్ స్టోర్స్ పేరిట కోట్ల రూపాయాల వ్యాపారం జ‌రుగుతుంది.

అందులోనూ చెన్నైలో స్టోర్స్ ఎక్కువ‌. ఇంకా సౌత్ లో కొన్ని మెట్రోపాలిటిన్ సిటీస్ లో శ‌ర‌వ‌ణన్ వ్యాపారానికి తిరుగు లేదు. అంత‌టి వ్యాపార వేత్త సినిమాల్లోకి పెద్ద స్టార్ అయిపోదామ‌ని ఊర‌క‌నే రాలేదు. దీని వెనుక బిజినెస్ స్ట్రాటజీ ఉంద‌ని తెలుస్తోంది. త‌న బిజినెస్ కి సంబంధించి అత‌నే యాడ్ షూట్ లో స్వ‌యంగా న‌టిస్తాడు.

ఆయాడ్ లో శ‌ర‌వ‌ణ‌న్ తో పాటు ఇద్ద‌రు హీరోయిన్లు కూడా త‌ప్ప‌నిసరి. బిజినెస్ కి సంబంధించి ఇలాంటి యాడ్స్ త‌ప్ప‌నిస‌రి. శ‌ర‌వ‌ణ‌న్ ఇలాంటి యాడ్స్ కి ఒక్కో దానికి 5 నుంచి 10 కోట్లు ఖ‌ర్చు చేస్తుంటాడు. అలా పాన్ ఇండియా వైడ్ డివైడ్ చేసి యాడ్స్ చేయాలంటే త‌డిపిమోపుడు అవుతుంది. 200 కోట్లకు పైగానే కేటాయించాలి.

స్థానిక భాష‌ల హీరోయిన్ల‌ని ఎంపిక చేసుకోవాలి. ఓ పేరున్న డైరెక్ట‌ర్నీ ఒప్పించాలి. వాళ్ల‌కి భారీగా పారితోషికం చెల్లించాలి. ఇంకా టెక్నిక‌ల్ గా ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌తో కూడుకున్న వ్య‌వ‌హారం. ఇలా అన్ని భాష‌ల్లో యాడ్స్ చేయ‌డం అంటే చిన్న విష‌య‌మా? అందులోనూ ఉత్త‌రాది రాష్ట్రాల్లో ఫేమ‌స్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. బోలెడంత ఖ‌ర్చు.

అవ‌న్నీ క‌లిసి రావాలంటే సినిమా ఒక్క‌టే మార్గంగా భావించి పాన్ ఇండియాలో 'ది లెజెండ్' సినిమా చేసాడు. అలాగ‌ని ఈ సినిమాతో ఆయ‌నేమి సూప‌ర్ స్టార్ కాలేదు. పెట్టిన పెట్టుబ‌డి సంగ‌తి ప‌క్క‌న‌బెడితే సినిమాకి అన్ని వైపులా న‌ష్టాలే వ‌చ్చాయి. కానీ ఈ సినిమాతో శ‌ర‌వ‌ణ‌న్ అనే అత‌ను ఉన్నాడు? అన్న సంగ‌తి జ‌నాల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుందిగా.

ఆ ఐడెంటిటీని త‌న వ్యాపారానికి ఎంతో కొంత ఉప‌యోగప‌డే అవ‌కాశమైతే ఉంటుందిగా. మ‌రో సినిమా చేసి ఇంకాస్త ఐడెంటిటీని బిల్డ్ చేయ‌డానికి ఛాన్స్ ఉంది. ల‌క్కీగా స‌క్సెస్ అయితే గ‌నుక ఆ ఇమేజ్ తో త‌న బిజినెస్ బ్రాండింగ్ ల్ని తానే స్వ‌యంగా ప్ర‌మోట్ చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉంది. ఇలా ఇన్ని లాజిక్ లు మ‌ధ్య శ‌ర‌వ‌ణ‌న్ ముఖానికి మాత్ర‌మే రంగు వేసుకున్నాడు. మ‌న‌సుకి కాదు.