Begin typing your search above and press return to search.

`థాంక్యూ` వాయిదాకి కార‌ణం అదేనా?

By:  Tupaki Desk   |   23 April 2022 2:30 AM GMT
`థాంక్యూ` వాయిదాకి కార‌ణం అదేనా?
X
యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య `ల‌వ్ స్టోరీ`...`బంగ‌ర్రాజు` స‌క్సెస్ ల‌తో ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇదే ఉత్సాహంతో `థాంక్యూ` చిత్రంతోనూ మెప్పించ‌డానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా అప్ డేట్ మాత్రం లేదాయే. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `థాంక్యూ` చాలా కాలం క్రిత‌మే ప్రారంభ‌మైంది. చిత్రీక‌ర‌ణ కూడా ముగించుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అయితే ఇంత వ‌ర‌కూ సినిమా రిలీజ్ తేదీపై ఎలాంటి అప్ డేట్ లేదు.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కి చేరుకున్న ఆ రిలీజ్ తేదీని ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యంగానే క‌నిప‌నిస్తుంది. సినిమా కి సంబంధించి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ త‌ప్ప ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి అప్ డేట్ లేదు. కొత్త పోస్ట‌ర్లు లేవు..గ్లింప్స్ హ‌డావుడి లేదు. టీజ‌ర్ రాలేదు. దీంతో అభిమానులకు `థాంక్యూ` వెనుక ఏం జ‌రుగుతుందో? అర్ధంకాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. వాస్త‌వానికి చిత్రాన్ని జులైలో రిలీజ్ చేయాల‌ని ముందుగా ప్లాన్ చేసారు.

కానీ తాజా ప‌రిస్థితులు చూస్తుంటే జులై రిలీజ్ క‌ష్ట‌మ‌నే తెలుస్తోంది. ఇప్ప‌టికే జులై తేదీల్ని కొన్ని సినిమాలు లాక్ చేసి పెట్టాయి. 1న `ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్`.. 8న `మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం`.. 22 `కార్తికేయ -2`..28న సుదీప్ `విక్రాంత్ రోనా` స‌హా కొన్ని సినిమాలు తేదీల్ని లాక్ చేసాయి. కాబ‌ట్టి వాటి రిలీజ్ కి చై అడ్డు త‌గిలే అవ‌కాశం లేదు. మే...జూన్ లో వ‌చ్చే అవ‌కాశం లేద‌ని క్లోజ్ సోర్సెస్ చెబుతున్నాయి.

వీట‌న్నింటిని బ‌ట్టి చూస్తుంటే `థాంక్యూ` ఆగ‌స్టు ..సెప్టెంబ‌ర్ వ‌ర‌కూ వెళ్లే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఇంత ఆల‌స్యానికి కార‌ణం ఏంటి? అన్న‌ది అధికారికంగా వెల్ల‌డిస్తే గానీ క్లారిటీ రాదు. అయితే రిలీజ్ చేయాల‌ని నిశ్చ‌యించుకుంటే జూన్ లో స్కోప్ ఉంది. జూన్ లో `అంటే సుంద‌రానికి`..`రామారావు ఆన్ డ్యూటీ` చిత్రాలు త‌ప్ప అగ్ర హీరోల చిత్రాలేవి రిలీజ్ కి లేవు.

అయినా చైత‌న్య‌కి స్టార్లు ఎవ‌రూ పోటీ కాదు. మార్కెట్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ ఉంది. చైత‌న్య సినిమాల్ని ల‌వ్ చేసే లేడీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. యువ‌త‌లో మంచి క్రేజ్ ఉన్న హీరో. త‌న ఇమేజ్ తో ఆడియ‌న్స్ ని థియేట‌ర్ కి ర‌ప్పించ‌గల క్యాప‌బిలిటీ ఉన్న న‌టుడు. కాబ‌ట్టి చైకి చైత‌న్యే నే పోటీ. అత‌ని ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ కి ఎవ‌రు సాటి. థాంక్యూ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వ‌రా క్రియేష‌న్స్ పై దిల్ రాజు నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.