Begin typing your search above and press return to search.
సుక్కు ఎందుకు డైరెక్షన్ వదిలేస్తానన్నాడంటే..
By: Tupaki Desk | 23 Jan 2016 5:00 PM ISTసుక్కు డైరెక్ట్ చేసేది ఇంకో రెండు సినిమాలేనట.. ఆ తర్వాత దర్శకత్వం వదిలేస్తాడట.. రెండు రోజులుగా టాలీవుడ్ లో చర్చనీయాంశమవుతున్న వార్త ఇది. సుక్కు లాంటి ఇంటలిజెంట్ - రేర్ డైరెక్టర్ దర్శకత్వం వదిలేస్తానంటే ఎవ్వరికైనా బాధ కలుగుతుంది. అందుకే ఈ వార్త ఆయన అభిమానులకు తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. ఐతే సుక్కుకి అప్పుడే దర్శకత్వం మీద ఎందుకంత విరక్తి కలిగిందన్నది జనాలకు అర్థం కావడం లేదు. వరుసగా ఫెయిల్యూర్లు ఎదురైనపుడు.. చెత్త సినిమాలు తీస్తున్నపుడు ఈ ఫీలింగ్ కలిగితే అర్థం ఉంది. కానీ సుక్కు లేటెస్ట్ మూవీ ‘నాన్నకు ప్రేమతో’ హిట్టయింది. అందులో సుకుమార్ అద్భుతమైన ప్రతిభ చూపించాడు. మరి ఎందుకతడికి వైరాగ్యం కలిగింది? అదేదో సుక్కు మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘నాకు దర్శకుడిగా కంటే నిర్మాతగా, రచయితగా ఉండటం ఇష్టం. అందుకే ఇంకో రెండు సినిమాలు తీశాక దర్శకత్వం ఆపేద్దామనుకుంటున్నా. దర్శకుడి పాత్రలో ఉంటూ నేను పేపర్ మీద సన్నివేశాలు పూర్తి చేసి సెట్స్ లోకి తీసుకెళ్లలేకపోతున్నాను. సెట్లో నటీనటులు - సాంకేతిక నిపుణులు నా కోసం ఎదురు చూస్తుంటే నాకు చాలా గిల్టీగా అనిపిస్తోంది. సన్నివేశం పూర్తి చేయకుండా సెట్ లో క్రిమినల్ లాగా తిరుగుతూ ఉంటే అదోలా అనిపిస్తోంది. అదే నేను ఇండిపెండెంట్ రైటర్ గా ఉంటే బాగా రాస్తానేమో. అందుకే నా భార్యకు కూడా చెప్పేశా. కొంతకాలం తర్వాత దర్శకత్వం ఆపేస్తానని’’ అని వెల్లడించాడు సుక్కు. ఐతే సుకుమార్ తన బలహీనత గురించి ఏం చెప్పినా.. అతడి టాలెంట్ ఏంటన్నది తెరమీద ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంటుంది. అలాంటి దర్శకుడిని వదులుకోవడానికి అతడి అభిమానులు ఏమాత్రం సిద్ధంగా లేరు. నిజంగా సుక్కు దర్శకత్వం ఆపేస్తే అతడి ఫ్యాన్స్ ఊరుకుంటారా? అప్పుడు తెలుస్తుంది జనాల్లో సుక్కుకి ఎంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారన్నది.