Begin typing your search above and press return to search.

మెగా సినిమాలో శోభన్ పాటెందుకు?

By:  Tupaki Desk   |   10 Sep 2019 8:25 AM GMT
మెగా సినిమాలో శోభన్ పాటెందుకు?
X
ఈ నెల 20న విడుదల కానున్న వరుణ్ తేజ్ వాల్మీకి మీద మాస్ లో మంచి అంచనాలు ఉన్నాయి. గద్దలకొండ గణేష్ గా ఎన్నడూ చూడని అవతారంలో వరుణ్ ని చూసి ఫ్యాన్స్ సైతం షాక్ తిన్నారు. అటు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోనూ హీరో లుక్స్ ని దర్శకుడు హరీష్ శంకర్ డిఫరెంట్ గా ప్లాన్ చేయడంతో ఓ రేంజ్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉండగా ఇందులో అలనాటి శోభన్ బాబు సూపర్ హిట్ సాంగ్ ఎల్లువొచ్చి గోదారమ్మను రీమిక్స్ చేసి పూజా హెగ్డే వరుణ్ ల మీద షూట్ చేసిన సంగతి తెలిసిందే.

ఎన్నో బ్లాక్ బస్టర్ చిరంజీవి పాటలు ఉండగా ఈ శోభన్ బాబు సాంగ్ ఎందుకనే డౌట్ మెగా అభిమానులకు రావడం సహజమే. దానికి కథ ప్రకారం అలా పెట్టామని హరీష్ శంకర్ చెప్పాడు కానీ వాస్తవం ఇంకోటి ఉందట. దాని ప్రకారం వరుణ్ తేజ్ ఈ పాట వచ్చే ఎపిసోడ్ లో 1982 కాలంలోకి వెళ్ళిపోతాడు. ఆ టైంలో వచ్చిందే దేవత సినిమా. అప్పటికి చిరంజీవికి చెప్పుకోదగ్గ మ్యూజికల్ హిట్స్ పెద్దగా లేవు. ఖైదీ వచ్చింది 1983లో.

సో చిరు పాట వాడుకోవాలన్నా ఛాన్స్ లేకపోయింది.అంతే కాదు పూజా హెగ్డేని ఇందులో శోభన్ బాబు వీరాభిమానిగా చూపనుండటంతో ఇంత కన్నా మంచి ఆప్షన్ లేదని దేవత ట్రాక్ ని రీమిక్స్ చేసుకున్నారు. సో పెదనాన్న పాట వాడుకోవాలని ఉన్నా వరుణ్ తేజ్ స్టోరీ డిమాండ్ ప్రకారం లవర్ కోసం శోభన్ ఫ్యాన్ గా మారక తప్పలేదు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన వాల్మీకి సైరాకు సరిగ్గా రెండు వారాల ముందు పలకరించబోతున్నాడు