Begin typing your search above and press return to search.

ఎస్.జె.సూర్యతో తేడా కొట్టింది అందుకా?

By:  Tupaki Desk   |   24 July 2016 7:00 PM IST
ఎస్.జె.సూర్యతో తేడా కొట్టింది అందుకా?
X
పవన్ కళ్యాణ్‌ కు, ఎస్.జె.సూర్యకు ఉన్న స్నేహం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తనకు ‘ఖుషి’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సూర్యకు మంచి ప్రయారిటీ ఇచ్చేవాడు. దర్శకుడిగా అతను ఫేడవుట్ అయిపోయిన టైంలోనూ ‘పులి’ చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ సినిమా డిజాస్టర్ అయినా.. మళ్లీ ఇంకో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఐతే ఈ సినిమాకు ప్రి ప్రొడక్షన్ అంతా పూర్తయి.. ఇక సెట్స్ మీదికి వెళ్లడమే ఆలస్యం అనుకుంటున్న టైంలో సూర్య బయటికి వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమా ఆలస్యమవుతుండటం.. నటుడిగా బిజీ అవుతుండటం వల్లే సూర్య ఇందులోంచి తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. ఐతే ఇవి కూడా అతను తప్పుకోవడానికి కారణాలే అయినా.. వీటితో పాటు ఇంకో ముఖ్య కారణం కూడా ఉందట.

పవన్ సినిమా కోసం సూర్యకు చాలా తక్కువ పారితోషకం ఆఫర్ చేశారట. అది కూడా కోటి రూపాయల లోపే అని సమాచారం. ముందు సూర్య సర్దుకుపోవాలని భావించినా.. అదే సమయంలో ‘ఇరైవి’ సినిమా విడుదల కావడం.. అతడి నటనకు గొప్ప పేరు రావడం.. నటుడిగా భారీ పారితోషకాలతో ఆఫర్లు రావడంతో సూర్య పునరాలోచనలో పడ్డాడట. రెమ్యూనరేషన్ పెంచాలని అడిగినా సరైన స్పందన రాకపోవడంతో అన్ని విషయాలూ బేరీజు వేసుకుని.. ఈ సినిమా నుంచి తప్పుకోవడమే మేలని నిర్ణయించుకున్నాడట సూర్య. ఐతే అతను ఏ నాన్సెన్స్ చేయకుండా మర్యాదపూర్వకంగానే ఈ సినమిా నుంచి తప్పుకున్నాడట.