Begin typing your search above and press return to search.

సీత మౌనం వెనుక కారణం

By:  Tupaki Desk   |   16 April 2019 11:05 AM GMT
సీత మౌనం వెనుక కారణం
X
ముందు చెప్పిన ప్రకారం అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా సీత ఏప్రిల్ 25 విడుదల కావాలి. మొన్న శ్రీరామనవమి సందర్భంగ విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ లో అదే తేదీని హై లైట్ చేశారు. ఇప్పటి దాకా ఓ ఐటెం సాంగ్ ఆడియోతో పాటు దాని వీడియో శాంపిల్ తప్ప ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. అంతకుముందు కొద్దిరోజుల క్రితం వదిలిన టీజర్ కు రెస్పాన్స్ బాగానే వచ్చింది. అయినా కూడా టీమ్ సైలెంట్ గా ఉంది.

చేతిలో పది రోజులు కూడా లేదు. ట్రైలర్ విడుదల ప్రీ రిలీజ్ ఈవెంట్ పెండింగ్ ఉండిపోయాయి. ఇంకా షూటింగ్ చివరి ప్యాచ్ వర్క్ దశలో ఉందని అయినా కూడా డేట్ వెనక్కు తీసుకునే ఉద్దేశంలో తేజ లేడని ఖచ్చితంగా ఏప్రిల్ 25 విడుదల చేసే తీరాలని ఫిక్స్ అయ్యడట. ఆ మేరకు సెన్సార్ కోసం డేట్ కూడా తీసుకున్నారని తెలిసింది

ఇప్పుడు ఇంత తక్కువ వ్యవధిలో సీతకు అవసరమైన బజ్ తేవడం సాధ్యమేనా అంటే వెంటనే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఒకవైపు ప్యాచ్ వర్క్ మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ ఇంకో వైపు సెన్సార్ కోసం త్వరగా రీ రికార్డింగ్ పూర్తి చేసే బాధ్యత. ఇన్ని ఒత్తిళ్ల మధ్య టీమ్ అందుకే ప్రమోషన్ మీద ఇంకా ఫోకస్ పెట్టలేదని ఇన్ సైడ్ టాక్.

రెగ్యులర్ మసాలాలకు దూరంగా సాయి శ్రీనివాస్ ఏదో కొత్తగా ట్రై చేశాడన్న అభిప్రాయం సీత టీజర్ చూసాక జనంలో కలిగింది. ఆ ఆసక్తిని అలాగే నిలుపుకుంటూ అంచనాలు పెంచాలంటే సీత సౌండ్ పెంచాల్సిందే. తేజ మాత్రం ట్రైలర్ వచ్చాక హైప్ అదే వచ్చేస్తుందనే ధీమాతో ఉన్నాడట. ఇంకో రెండు మూడు రోజుల్లో ఖచ్చితమైన క్లారిటీ అయితే ఇవ్వాల్సిందే