Begin typing your search above and press return to search.

ఇంతకీ ఆయనగారెక్కడ సానియా..

By:  Tupaki Desk   |   19 July 2016 12:11 PM IST
ఇంతకీ ఆయనగారెక్కడ సానియా..
X
సానియా మీర్జాకు పెళ్లై నాలుగేళ్లవుతోంది. ఆమె భర్తతో కనిపించిన సందర్భాలు చాలా చాలా తక్కువ. పెళ్లయిన కొత్తలో అప్పుడప్పుడూ జంటగా కనిపించారు. ఆ తర్వాత ఒకట్రెండు టీవీ కార్యక్రమాల్లో అతిథులుగా దర్శనమిచ్చారు. అంతే.. గత రెండేళ్లుగా అయితే ఇద్దరూ కలిసి కనిపించిన దాఖలాలే లేవు. టెన్నిస్ టోర్నీల కోసం ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఎందరినో కలుస్తూ..వారితో కలిసి సంబరాలు చేసుకుటూ ట్విట్టర్లో ఫొటోలు పెడుతుంటుంది సానియా. కానీ ఎందులోనూ భర్త షోయబ్ మాలిక్ కనిపించడు. అతడి ప్రస్తావన కూడా తీసుకురాదు సానియా. కనీసం అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ మెసేజ్ పెట్టడం కూడా చేయట్లేదు. దీని గురించి ఎవరైనా అడిగితే.. వ్యక్తిగత విషయాలు మీకెందుకు అంటుంది.

ఆ సంగతలా వదిలేస్తే.. ఈ మధ్యే సానియా మీర్జా ‘ఏస్ అగైన్స్ట్ ఆల్ ఆడ్స్’ అనే పేరుతో ఓ ఆత్మకథ రాసింది. హైదరాబాద్ లో ఈ పుస్తకావిష్కరణ జరిగింది. ఇది సానియా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. కానీ ఈ కార్యక్రమంలో షోయబ్ లేడు. షారుఖ్ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరిగింది. సానియా తల్లిదండ్రులు.. చెల్లెలు ఈ కార్యక్రమంలో ఉన్నారు కానీ.. షోయబ్ కనిపించలేదు. ఆ తర్వాత ముంబయికి వెళ్లి అక్కడ సల్మాన్ చేతుల మీదుగా పుస్తకం ఆవిష్కరించింది సానియా. అక్కడే షోయబ్ కనిపించలేదు. కనీసం అతడి ప్రస్తావన కూడా తేలేదు సానియా. షోయబ్ మరీ ఇంత బిజీ ఏంటో.. అతడి గురించి సానియా మాట్లాడకపోవడం ఏంటో.. ఇంతకీ వీళ్లిద్దరి బంధం సాఫీగానే సాగుతోందా?