Begin typing your search above and press return to search.

అఖిల్ నాన్న వెనుక కథ ఇదా ?

By:  Tupaki Desk   |   8 July 2019 10:48 AM IST
అఖిల్ నాన్న వెనుక కథ ఇదా ?
X
అక్కినేని నాగార్జున రెండో వారసుడు అఖిల్ హీరోగా గీత ఆర్ట్స్ బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో తండ్రి పాత్రకు తమిళ నటుడు సముతిరఖనిని తీసుకున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. దీనికి రెండు కారణాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మొదటిది ఫ్రెష్ నెస్. ఈ మధ్య ఫాదర్ రోల్స్ కోసం దర్శకులకు పెద్దగా ఆప్షన్స్ ఉండటం లేదు. దొరికితే ప్రకాష్ రాజ్ వద్దనుకుంటే రావు రమేష్ లేదా ఇంకో ఆప్షన్ గా పోసాని. వీళ్ళనూ కాదనుకుంటే కోలీవుడ్ నుంచి జయప్రకాశ్. ఇంతే.

గత ఏడాది కాలంగా వచ్చిన సినిమాలన్నీ చూస్తే ముప్పాతిక శాతం వీళ్ళే కనిపిస్తారు. అందుకే రొటీన్ అవుతుందనే ఉద్దేశంతో మనవాళ్లకు పరిచయం లేని సముతిరఖనిని ఎంచుకున్నారట. ఇప్పటికే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కార్తికేయ ఆకాశవాణి సినిమాల్లో నటిస్తున్న సముతిరఖనికి ఇది మూడో తెలుగు స్ట్రెయిట్ మూవీ. కానీ ముందు అఖిల్ సినిమానే విడుదలయ్యే ఛాన్స్ ఉంది. మొదటి రెండూ గ్రాఫిక్స్ బేస్డ్ మూవీస్ కావడంతో లేట్ అవుతాయి

ఇక రెండో కారణం విషయానికి వస్తే ముందు ప్రకాష్ రాజ్ కే ఈ కథను వినిపిస్తే కొత్తదనం ఏమి అనిపించకపోవడంతో పాటు రొటీన్ వి చేయను అని చెప్పారట. దాంతో ఇది కాస్తా ఖనికి వెళ్లినట్టు సమాచారం. కారణం ఏదైనా ఇలాంటి నిర్ణయం ప్లస్ అయ్యేదే. మంచి నటుడైన సముతిరఖని తెలుగు ప్రేక్షకులకు రఘువరన్ బిటెక్ లో ధనుష్ తండ్రిగా బాగా కనెక్ట్ అయ్యాడు. సో అఖిల్ కు నాన్నగా మరీ కొత్తగా కనిపించకపోయినా ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగించగలడు