Begin typing your search above and press return to search.

సామ్ చెప్పిన బ్రేక్ లెక్కేంటి? అసలేం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   27 Aug 2021 3:10 AM GMT
సామ్ చెప్పిన బ్రేక్ లెక్కేంటి? అసలేం జరుగుతోంది?
X
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉండొచ్చు. కానీ.. సమంత కథ మాత్రం భిన్నం. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన సామ్.. అనతి కాలంలో తన సత్తా ఏమిటో చాటటమే కాదు.. యూత్ మదిలో తిష్ట వేసేసి.. తనను తాను తిరుగులేని నటిగా నిరూపించుకుంది. నిర్మాతలకు.. ఆమెతో జత కట్టే హీరోలకు లక్కీ ఛామ్ గా మారిన ఆమె.. ఏ మాయ చేశావేతో మొదలు.. ఇప్పటివరకు ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదనే చెప్పాలి.

నాగచైతన్యతో జత కట్టిన ఆమె.. పెళ్లి తర్వాత మరింత సక్సెస్ ను సొంతం చేసుకుందని చెప్పాలి. ఈ మధ్యనే డిజిటల్ ప్లాట్ ఫాం మీద ఎంట్రీ ఇవ్వటమే కాదు.. టిపికల్ పాత్రను పోషించి.. అందరి మనసుల్ని దోచుకుంది. ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రను పోషించినప్పటికీ.. తన నటనతో అందరి ప్రశంసల్ని సొంతం చేసుకుంది. అలాంటి సమంత ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని సిత్రమైన వార్తలతో ఆమె పేరు జత కలుస్తోంది.

ఈ మధ్యనే తన సోషల్ మీడియా ఖాతాలో అక్కినేని బదులుగా ఎస్ అక్షరం మార్చుకోవటం.. ఇదంతా ఆమె నటిస్తున్న శాకుంతలం మూవీ ప్రమోషన్ కోసం చేస్తున్నది భావించారు. అయితే.. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె.. పేరు మార్పు వెనుక కారణం గురించి క్లారిటీ ఇవ్వలేదు. రోటీన్ కుభిన్నంగా ఆమె సమాధానం ఉండటంతో.. సమ్ థింగ్.. సమ్ థింగ్ ఉందన్న వాదన మొదలైంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాను కొంతకాలం బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పి అందరికి షాకిచ్చింది. ఎందుకిలా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తాను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతుందని.. ఇప్పటివరకు ఏ మాత్రం ఖాళీ లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నానని.. ఇప్పటికైనా కాస్తంత విరామం తీసుకోవాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పారు. ఈ సమయాన్ని పూర్తిగా వ్యక్తిగత జీవితానికి.. ఫ్యామిలీకి ఇవ్వాలని తాను అనుకుంటున్నట్లు చెప్పారు.

దీంతో.. మళ్లీ కొన్ని క్వశ్చన్లు తెర మీదకు వచ్చాయి. కరోనా కారణంగా.. నిమిషం ఖాళీ లేనోళ్లు సైతం.. అంతులేని సమయాన్ని ఇంట్లో గడపటాన్ని మర్చిపోలేం. దాదాపు ఏడాదిన్నర కాలంలో.. తొమ్మిది నెలల పాటు అయితే.. ప్రముఖులు ఎవరూ తాము సిద్ధం చేసుకున్న బయో బబుల్ నుంచి బయటకు రావటానికి ఇష్టపడని పరిస్థితి. ప్రస్తుతం ఆ మిస్ చేసుకున్న సమయాన్ని మరింత సద్వినియోగం చేసుకోవటం కోసం విపరీతంగా పని చేస్తున్నారు.

అందరి తీరు ఇలా ఉంటే.. సమంత మాత్రం అందుకు భిన్నంగా బ్రేక్ తీసుకోవటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. ఏదైనా స్వీట్ న్యూస్ కారణంగా బ్రేక్ తీసుకుంటుందా? లేదంటే.. సోషల్ ఖాతాలో పేరు మార్చుకున్న దానికి సంబంధించిన ఇష్యూకు సంబంధించి తాజాగా ఏదైనా పరిణామం చోటు చేసుకుందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏమైనా.. సమంత ఎపిసోడ్ ఇప్పుడు మరింత ఆసక్తికరంగానే కాదు.. ఎప్పుడూ లేనన్ని క్వశ్చన్లకు తెర తీసిందని చెప్పాలి.