Begin typing your search above and press return to search.

మణి సార్‌ సినిమాను వదిలేసిందంతే..

By:  Tupaki Desk   |   18 April 2016 2:45 PM IST
మణి సార్‌ సినిమాను వదిలేసిందంతే..
X
కొంతమంది హీరోయిన్లు అంతే. వారు తమకు నచ్చిన పందాలోనే నడుస్తుంటారు. కాని వారి డేరింగ్‌ డెసిషన్లు ఒక్కోసారి బెడసి కొడతాయేమో కాని.. చాలాసార్లు చాలా ఇంప్రెసివ్‌ గా అనిపిస్తుంటాయి. ఇప్పుడు తమిళ పిల్ల సాయి పల్లవి గురించి అందరూ ఇదే చర్చించుకుంటున్నారు.

మలయాళంలో ''ప్రేమమ్‌'' సినిమాలో మలర్‌ అనే క్యారక్టర్‌ చేసి అందరికీ దగ్గరైంది సాయి పల్లవి. అయితే అంతకంటే ముందు మెడిసిన్‌ ఫైనల్‌ చదువుతున్న ఈ ఫ్యూచర్‌ డాక్టరమ్మ.. ''ఢీ'' అనే డ్యాన్సు షో కంటెస్టెంట్‌ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం. ఇప్పుడు ఈ భామను ఏకంగా మణిరత్నం తన తదుపరి సినిమాలో హీరోయిన్‌ గా తీసుకున్నాడు. అయితే సినిమా కోసం అమ్మడు ఓ రెండు మూడు ఇంటిమేట్‌ సీన్లు చేయాల్సి ఉందని చెప్పారట మణిరత్నం. హీరో కార్తి సరనన మాత్రమే.. అసలు సినిమాల్లో ఇలాంటి ఎక్స్ పోజింగ్‌ అండ్‌ రొమాన్స్‌ తనకు ఇష్టం లేదని తేల్చేసిన సాయి పల్లవి.. ఈ సినిమా నుండి తప్పుకుంది.

మొత్తానికి మణి సార్‌ సినిమా అని కూడా చూడకుండా.. తను అనుకున్న రూల్సుకే కట్టుబడి ఉన్న సాయి పల్లవిని ఇప్పడు అందరూ తెగ అభినందించేస్తున్నారు. ఇక మొన్ననే ''కాళీ'' అనే మలయాళం సినిమాలో అమ్మడు డల్కర్‌ సల్మాన్‌ సరసన అతని వైఫ్‌ గా నటించి అద్బుతమైన నటన ప్రదర్శించింది. ఆఫర్ల విషయంలో ఈమె వెనుకే ఓ డజను సినిమాలున్నాయిలే. అది సంగతి.