Begin typing your search above and press return to search.

ఆడియో ఫంక్షన్లు రవిబాబు ఎందుకు చేయడంటే?

By:  Tupaki Desk   |   20 Oct 2019 5:42 AM
ఆడియో ఫంక్షన్లు రవిబాబు ఎందుకు చేయడంటే?
X
రవిబాబు.. విలన్ గా ఎంట్రీ ఇచ్చి దర్శకుడిగా మారిన విలక్షణ నటుడీయన.. హర్రర్ - దెయ్యం - ఫిక్షన్ కథలను ఎంచుకొని తెరకెక్కిస్తుంటాడు.. విలక్షణమైన టేకింగ్ తో సినిమాలు తీస్తుంటాడు..

అయితే ఇప్పటికే చాలా సినిమాలు తీసి బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన రవిబాబు తను దర్శకత్వం వహించిన ఏ సినిమాకు ఆడియో ఫంక్షన్ కానీ, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ చేయడు. అంతేకాదు.. వేరే హీరోల సినిమాలకు అతిథిగా రమ్మని ఆహ్వానించినా రాడు.. ఎందుకిలా అని డౌట్ వచ్చి తాజాగా విలేకరులు రవిబాబును అడిగేశారు. దీనికి ఆసక్తికర సమాధానాన్ని రవిబాబు ఇవ్వడం విశేషం.

రవిబాబుకు ఆది నుంచి ఆడియో ఫంక్షన్లు అన్నా, ప్రి రిలీజ్ ఈవెంట్లు అన్న పిచ్చబోర్ అంట.. అందులో కూర్చోవడం.. యాంకర్లు పిచ్చి పిచ్చి జోకులు వేస్తూ, పొగుడుతూ ఉంటే అస్సలు నవ్వు రాదట .. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడట.. విపరీతమైన రొదకు నాకు అస్సలు వెళ్లాలనిపించదు.. చేయాలనిపించదు అని రవిబాబు అసలు కారణం చెప్పేశాడు.

ఇక బాలయ్య అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన సినిమా చేయమని కోరినా తన దగ్గర బాలయ్యకు సూటయ్యే కథలేదని రవిబాబు తెలిపాడు. తాను హీరోలను బట్టి కథలను రూపొందించనని.. కథ రెడీ అయ్యాక దానికి సూటయ్యే వారినే తీసుకుంటానని రవిబాబు తెలిపాడు.