Begin typing your search above and press return to search.
సోషల్ మీడియాలో చెర్రీ స్పీడ్ కారణమిదే!
By: Tupaki Desk | 13 July 2019 7:00 AM ISTఇతర హీరోలతో పోలిస్తే సోషల్ మీడియాలో రామ్ చరణ్ స్పీడ్ తక్కువే. అల్లు అర్జున్ .. ఎన్టీఆర్ లాంటి స్టార్లతో పోలిస్తే.. చరణ్ సోషల్ మీడియాకు ఇన్నాళ్లు దూరంగానే ఉన్నారు. అయితే ఇటీవల అతడి పంథాలో మార్పు వచ్చింది. మొన్నటికి మొన్న ఇన్ స్టాగ్రమ్ లో ప్రవేశించిన చరణ్ తాజాగా ట్విట్టర్ లో కి ఆరంగేట్రం చేయడంపై అభిమానుల్లో చర్చకొచ్చింది. ఫేస్ బుక్ తో పాటు ఇన్ స్టాగ్రమ్ .. ట్విట్టర్ ద్వారా ఇకపై చరణ్ వ్యక్తిగత- వృత్తిగత సమాచారం అభిమానులకు చేరనుంది. ముఖ్యంగా సినిమాల ప్రమోషన్స్ కి ఈ వేదికల్ని చరణ్ ఉపయోగించుకోనున్నారని తెలుస్తోంది.
ఇటీవలే `ఆల్వేస్ రామ్ చరణ్` పేరుతో ఇన్ స్టాగ్రమ్ లో ప్రవేశించిన చరణ్ ఆర్.ఆర్.ఆర్ మూవీ స్టిల్ ని పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేవలం కొన్ని గంటల్లోనే లక్షల్లో ఫాలోవర్స్ ఇన్ స్టాలో లైక్ లు కొడుతూ చరణ్ ని అనుసరించారు. ఈ మాధ్యమంలో ఇప్పటికే 4.70 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. లేటెస్ట్ గా ట్విట్టర్ లోనూ చరణ్ ని ఫాలో చేసేందుకు అభిమానులు ఆసక్తిని కనబరిచారు. ఇలా ట్విట్టర్ లో చేరి తొలి పోస్టుగా తన మాతృమూర్తి సురేఖ గారితో కలిసి ఉన్న ఫోటోని చరణ్ షేర్ చేశారు. తన తల్లిగారితో ఉన్న ప్రేమానుబంధాన్ని ఆ ఫోటో రివీల్ చేసింది. ఈ ఫోటోకి ఇప్పటికే 2.10 లక్షల మంది లైక్స్ కొట్టారు. ఇకపై సోషల్ మీడియా ద్వారా సినిమాలకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోల్ని.. ఫోటోల్ని చరణ్ ఇక్కడ షేర్ చేయనున్నారట.
అయితే ఉన్నట్టుండి చరణ్ ఇలా సోషల్ మీడియాలో స్పీడ్ పెంచడానికి కారణమేంటి? అంటే అందుకు ప్రత్యేక సందర్భం ఉంది. డాడ్ చిరంజీవికి `సైరా- నరసింహారెడ్డి` చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి గిఫ్ట్ గా ఇస్తానని ప్రకటించిన చరణ్ ఈ సినిమాకి సంబంధించిన ప్రచారంలో వేగం పెంచేందుకు రెడీ అవుతున్నారు. అక్టోబర్ లో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే సైరా ప్రమోషన్స్ ని సోషల్ మీడియాలో పరుగులు పెట్టించనున్నారు. ఇంతకుముందు ట్విట్టర్ నుంచి వైదొలిగి తిరిగి రీఎంట్రీ ఇవ్వడానికి ప్రత్యేక కారణం ఇదేనని అర్థమవుతోంది.