Begin typing your search above and press return to search.
ఈ కష్టం పడలేకే రాజమౌళి వదిలేశాడా?
By: Tupaki Desk | 7 May 2017 4:50 PM IST‘బాహుబలి: ది బిగినింగ్’ రిలీజైనపుడే.. ‘ది కంక్లూజన్’ తర్వాత రాజమౌళి చేసే సినిమా ఇదే అంటూ ఒక ప్రాజెక్టు తెరమీదికి వచ్చింది. అదే.. గరుడ. ‘బాహుబలి’ తరహాలోనే భారీ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించాలన్న ఆలోచనలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ‘గరుడ’ అనే పేరు చెప్పలేదు కానీ.. బాహుబలి ప్రపంచాన్ని కొనసాగిస్తూ మరో భారీ సినిమా చేసే ఆలోచన తనకు ఉన్నట్లుగా రాజమౌళి సూచనప్రాయంగా చెప్పాడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఇదే విషయం చెప్పాడు ఓ ఇంటర్వ్యూలో. ఈ సినిమా కోసం రూ.25 కోట్లతో స్పెషల్ టీజర్ చేస్తారని.. దీని బడ్జెట్ రూ.1000 కోట్లని కూడా ఊహాగానాలు వినిపించాయి.
కానీ తర్వాత తర్వాత ఈ ప్రాజెక్టు వార్తల్లో లేకుండా పోయింది. ఇప్పుడేమో రాజమౌళి తన తర్వాతి ప్రాజెక్టు విషయంలో ఏ క్లారిటీ లేదంటున్నాడు. మరి ‘గరుడ’ ప్రాజెక్టును రాజమౌళి ఎందుకు పక్కన పెట్టేశాడన్నది అర్థం కాని విషయం. ఐతే రాజమౌళి సన్నిహితులు చెబుతున్నదేమంటే.. ‘బాహుబలి: ది కంక్లూజన్’ చేస్తున్న సమయంలో రాజమౌళి ఆలోచన మారిందట. ఈ సినిమా కోసం ఐదేళ్లకు పైగా నిర్విరామంగా కష్టపడ్డ నేపథ్యంలో మళ్లీ వెంటనే మరో భారీ సినిమా అంటే కష్టమని.. ఇప్పుడిప్పుడే మళ్లీ అంత శ్రమ పడాలంటే అవ్వదని.. తన టెక్నీషియన్స్ ను మోటివేట్ చేయడం కూడా కష్టమని.. అందుకే ఈసారి మామూలు సినిమా చేసి తన టీంకు కొంత రిలీఫ్ ఇవ్వాలని... ఆ తర్వాత ‘గరుడ’ తరహా సినిమా చేయొచ్చని రాజమౌళి భావించాడట. అందుకే ఈసారి గ్రాఫిక్స్.. వీఎఫెక్స్ లేకుండా సినిమా చేస్తానని రాజమౌళి అన్నట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/