Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ చెప్పిన షాకింగ్ నిజం?

By:  Tupaki Desk   |   15 Feb 2019 9:59 AM IST
ప్ర‌భాస్ చెప్పిన షాకింగ్ నిజం?
X
ఒకే ఒక్క సినిమా ప్ర‌భాస్ రేంజుని అమాంతం మార్చేసింది. ఒకే ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసిన చందంగా.. ఆ ఒక్క విక్ట‌రీ అత‌డి స్థాయిని అంద‌నంత ఎత్తుకి తీసుకెళ్లింది. ఆ సినిమా ఏదో ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఎస్.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `బాహుబ‌లి` సిరీస్ ప్ర‌భాస్ కి కీల‌క‌మైన‌ లైఫ్ ట‌ర్న్ అయ్యింది. అత‌డిని యూనివర్శ‌ల్ హీరోగా ఎలివేట్ చేసిన సెన్సేష‌న‌ల్ సిరీస్ ఇది. బాహుబ‌లి 1 - 2 చిత్రాల‌ కోసం ప్ర‌భాస్ ఏకంగా ఐదేళ్ల పాటు త‌న లైఫ్‌ ని అంకిత‌మివ్వ‌డంపై అప్ప‌ట్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. కేవ‌లం బాహుబ‌లి సిరీస్ కోసం.. జ‌క్క‌న్న‌కు ఇచ్చిన మాట కోసం.. భారీ పారితోషికం ఆఫ‌ర్ చేయ‌డం వ‌ల్ల‌.. ప్ర‌భాస్ ఇంత‌గా సాహ‌సించాడు అంటూ ప్ర‌చారం సాగింది. అయితే ఇది నిజ‌మా? అంటే ప్ర‌భాస్ నుంచి తాజాగా ఓ షాకిచ్చే స‌మాధానం వినిపించింది.

ఈ సినిమాలో ప్ర‌భాస్ న‌టించ‌డానికి కార‌ణం వేరొక‌టి ఉంది. అదే `తండ్రికి ఇచ్చిన మాట‌`. డాడ్ కీ.శే.ఉప్ప‌ల‌పాటి సూర్య నారాయణ రాజు కోరిక మేరకే అత‌డు బాహుబ‌లి సిరీస్ లో న‌టించాడ‌ట‌. తాను బ‌తికి ఉండ‌గా ప్ర‌భాస్ ని రారాజుగా వెండితెర‌పై చూడాల‌ని నాన్న గారు భావించార‌ట‌. అందుకే బాహుబ‌లి ఆఫ‌ర్ రాగానే వెంట‌నే ఇక ఏదీ ఆలోచించ‌కుండా ప్రాజెక్టుకు సంత‌కం చేసాన‌ని ప్ర‌భాస్ వెల్ల‌డించారు. అయితే బాహుబ‌లి రిలీజై అఖండ విజ‌యం సాధించినా అది చూసే భాగ్యం నాన్న‌గారికి లేకుండా పోయింది. 2010 ఫిబ్ర‌వ‌రి 12న ప్ర‌భాస్ తండ్రి గారైన సూర్య నారాయ‌ణ రాజు మ‌ర‌ణించారు. నాన్న‌కు ఇచ్చిన మాట నిల‌బెట్టాడు. ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై స‌త్తా చాటాడు. టాలీవుడ్ లో ఇంతింతై అన్న చందంగా ప్ర‌భాస్ అస‌మానంగా ఎదిగాడు. నేడు 250 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న `సాహో` లాంటి భారీ చిత్రంలో న‌టిస్తున్నాడు. మ‌రోసారి బాహుబ‌లి త‌ర్వాత అంత‌కు మించిన సెన్సేష‌న్స్ కి ప్ర‌భాస్ రెడీ అవుతున్నాడు. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఇన్నేళ్ల‌లో ఏనాడూ చూడ‌ని .. ``నెవ్వ‌ర్ బిఫోర్!`` అనిపించే యాక్ష‌న్ ఫాంట‌సీ అడ్వెంచ‌ర్ సినిమాలో న‌టిస్తున్నాడు. బాలీవుడ్ లో ఖాన్ ల‌కే సాధ్యం కాని ఫీట్ వేయాల‌ని అసాధార‌ణ‌మైన ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఒక విజ‌న్ ఉన్న క‌థానాయ‌కుడికి పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తున్నాడు ప్ర‌భాస్.

`సాహో` ఇప్ప‌టికే మెజారిటీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఆగ‌స్టు 15 రిలీజ్ తేదీ అని జేగంట మోగించారు కాబ‌ట్టి డెడ్ లైన్ నాటికి అన్ని ప‌నులు పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు చిత్ర‌యూనిట్ ప‌క‌డ్భందీ ప్ర‌ణాళిక‌ల‌తో అన్ని ప‌నుల్ని పూర్తి చేస్తోంది. సాహో ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో మ‌రో మైలురాయిగా మిగులుతుంద‌ని - రికార్డుల్ని బ్రేక్ చేస్తుంద‌ని ప్ర‌భాస్ అభిమానులు ఎంతో ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు. ఇండియ‌న్ స్క్రీన్ పై పెర్ఫెక్ట్ యాక్ష‌న్ హీరోగా ప్ర‌భాస్ ని చూడాల‌న్న పంతం రెబ‌ల్ స్టార్ ఫ్యాన్స్ లో అంత‌కంత‌కు పెరుగుతోంది.