Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ అందుకే హీరోయిన్ని మార్చాడా?!

By:  Tupaki Desk   |   10 Aug 2015 4:09 AM GMT
ప‌వ‌న్ అందుకే హీరోయిన్ని మార్చాడా?!
X
ఒక్క‌సారి మాటిచ్చాడంటే ఇక మ‌ళ్లీ వెన‌క్కి తీసుకోని మ‌న‌స్థ‌త్వం ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ ది. ఆరు నూరైనా... నూరు నూట ప‌ద‌హారైనా ఇచ్చిన మాట‌కి క‌ట్టుబ‌డి ఉంటాడంతే. అయితే ఇటీవ‌ల ఓ హీరోయిన్ విష‌యంలో మాత్రం ఆయ‌న త‌న మాట‌ని నిల‌బెట్టుకోలేక‌పోయాడు. అందుకు కొన్ని బ‌ల‌మైన కార‌ణాలు కూడా ఉన్నాయంటున్నాయి ఫిల్మ్‌ న‌గ‌ర్ వ‌ర్గాలు. ఆ వివ‌రాల్లోకి వెళితే...

`గ‌బ్బ‌ర్‌ సింగ్‌` సీక్వెల్‌ గా తెర‌కెక్కుతున్న `స‌ర్దార్‌`లో హీరోయిన్‌ గా అనీషా ఆంబ్రోస్‌ కి ఛాన్స్ ఇవ్వాల‌నుకొన్నాడు ప‌వ‌న్‌. ఆ మేర‌కు `గోపాల గోపాల‌`లో న‌టించేట‌ప్పుడే ఆమెకి మాట ఇచ్చేశాడ‌ట‌. అస‌లు అంత పెద్ద ఆశ‌లు కూడా లేని అనీషాకి ఒక్క‌సారిగా ప‌వ‌న్ ఆఫ‌ర్ ఇచ్చేస‌రికి ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యింది. ప‌వ‌న్ సినిమాలో ఛాన్స్ వ‌చ్చేసిందోచ్ అని దండోరా వేసుకొన్నంత ప‌నిచేసింది. మీడియా కూడా `ప‌వ‌న్ కొత్త హీరోయిన్‌ కి ఛాన్సిచ్చాడు... గ్రేట్` అంటూ ఆకాశానికెత్తేసింది. అయితే సినిమా సెట్స్‌ పైకి వెళ్లేస‌రికి ప‌వ‌న్ నిర్ణ‌యం మారింది. అనీషా స్థానంలో ఓ స్టార్ హీరోయిన్ని తీసుకోవాల‌ని ఆయ‌న డిసైడ్ అయ్యాడు. కాజల్ ఆ స్థానాన్ని భ‌ర్తీ చేస్తోంద‌ని కూడా తెలుస్తోంది.

ఆ విష‌యం తెలిసిన‌ప్ప‌ట్నుంచి అస‌లు ప‌వ‌న్ అలా వెన‌క్కి త‌గ్గ‌డానికి కార‌ణ‌మేమిటి? అనీషాని ఎందుకు వ‌ద్ద‌నుకొన్న‌ట్టు? అని అంతా ఆరా తీయ‌డం మొద‌లుపెట్టారు. కానీ ఎవ్వ‌రికీ కార‌ణాలు అంతుచిక్క‌లేదు. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు అస‌లు గుట్టు ఏంటంటే... `స‌ర్దార్‌` సినిమాని సెట్స్‌ పైకి వెళ్ల‌కుముందే ఓ కార్పొరేట్ సంస్థ‌కి అమ్మేశార‌ట‌. ఆ సంస్థ తాను కొన్న రేటుకి త‌గ్గ‌ట్టుగా సినిమా ఉండాలంటే స్టార్ హీరోయిన్ న‌టించాల్సిందే అని ప‌ట్టుబ‌ట్టింద‌ట‌. దీంతో ప‌వ‌న్ అనీషాకి స‌ర్దిచెప్పి కాజ‌ల్‌ ని ఎంపిక చేసుకొన్న‌ట్టు స‌మాచారం. మ‌రి త‌దుప‌రి సినిమాలో నైనా అనీషాకి ఛాన్స్ ఇస్తాడో లేదో!