Begin typing your search above and press return to search.

జూనియర్ అందుకే కనిపించడం లేదా?

By:  Tupaki Desk   |   18 Dec 2017 10:03 AM IST
జూనియర్ అందుకే కనిపించడం లేదా?
X
యంగ్ టైగర్ కొత్త సినిమా రిలీజ్ అయ్యి కొన్ని నెలలు గడిచిపోయింది. ఇప్పటికే ఎన్టీఆర్ కొత్త సినిమాపై ప్రకటన వచ్చినా.. షూటింగ్ ప్రారంభానికి ఇంకా నెలరోజులకు పైగా సమయం ఉంది. జనవరి నెల చివరకు కానీ.. త్రివిక్రమ్ తో సినిమాను మొదలుపెట్టే అవకాశం లేదు. ఈ సమయం అంతా ఎన్టీఆర్ బాగా లీజర్ గా గడిపేస్తున్నాడని అంతా అనుకుంటున్నారు.

అయితే.. అసలు విషయం వేరే ఉందట. నిజానికి యంగ్ టైగర్ మళ్లీ మేకోవర్ కు ట్రై చేస్తున్నాడట. తొలిసారిగా త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న మూవీ కావడం.. అందునా ఫ్యామిలీ జోనర్ లో రూపొందే చిత్రం కావడంతో.. ఆడియన్స్ ను అభిమానులను థ్రిల్ చేయాలని ఫిక్స్ అయ్యాడట ఎన్టీఆర్. ఇందుకోసం జిమ్ లో తెగ కసరత్తులు చేసేస్తున్నాడని తెలుస్తోంది. గతంలో కొన్ని మార్లు బాగానే సన్నబడినా.. ఎన్టీఆర్ మళ్లీ కాసింత ఒళ్లు చేశాడు. రీసెంట్ గా జై లవ కుశలో మూడు పాత్రల కోసం కూడా బాగా కష్టపడ్డాడు. ఇప్పుడు మాటల మాంత్రికుడి సినిమాలో.. దర్శకుడు మాటలతో మాయ చేస్తే.. ఫిజికల్ గా ఛేంజ్ చూపించబోతున్నాడట ఎన్టీఆర్.

డైట్.. ఎక్సర్ సైజ్ ల విషయంలో ఎన్టీఆర్ చాలా కేర్ తీసుకుంటున్నాడని.. మూవీ స్టార్ట్ అయ్యే సమయానికే మార్పు కనిపించనుందని.. ఈ విషయంలో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకే.. ఈ సమయంలో ఎక్కడా బైట కనిపించలేదని చెప్పుకుంటున్నారు.