Begin typing your search above and press return to search.

తంబీల కోసం నిధి సాహ‌సం

By:  Tupaki Desk   |   31 Dec 2019 1:30 AM GMT
తంబీల కోసం నిధి సాహ‌సం
X
అక్కినేని క‌థానాయిక నిధి అగ‌ర్వాల్ ఏమైంది? ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి సౌండ్ వినిపించ‌లేదేం? అంటే.. అందుకు ఓ స‌ర్ ప్రైజింగ్ రీజ‌న్ ప‌రిశ్ర‌మ‌లో వినిపిస్తోంది. ఇటీవ‌లే ఎన‌ర్జిటిక్ పూరి తెర‌కెక్కించిన `ఇస్మార్ట్ శంక‌ర్` బ్లాక్ బ‌స్ట‌ర్ అయినా కానీ.. నిధికి టాలీవుడ్ లో అదేమంత క‌లిసి రాక‌పోవ‌డంపై హాట్ హాట్ గా చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం మ‌హేష్ మేన‌ల్లుడు గ‌ల్లా అశోక్ స‌ర‌స‌న నాయికగా న‌టిస్తోంది.

అది మిన‌హా తెలుగులో చెప్పుకోద‌గ్గ అవ‌కాశాలేవీ లేవు. అందానికి అందం అదిరే ట్యాలెంట్ ఉన్నా ఎందుక‌నో నిధికి పెద్ద హీరోల స‌ర‌స‌న‌ ఆఫ‌ర్లు ఏవీ రాలేదు. మ‌రోవైపు హిందీ చిత్ర‌సీమ‌లోనూ ఈ అమ్మ‌డి కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. అక్క‌డ టైగ‌ర్ ష్రాఫ్ తో స్నేహం సైతం త‌న‌కు ఏమాత్రం క‌లిసి రావడం లేదు. కార‌ణం ఏదైనా ప్ర‌స్తుతం నిధి టెన్ష‌న్స్ లో ఉంద‌ట‌.

హైద‌రాబాద్ కి చెందిన ఈ అమ్మ‌డు బెంగ‌ళూరు ర్యాంప్ ని ఇర‌గ‌దీసింది. అటుపై ముంబై ఫ్యాష‌న్ ఇండ‌స్ట్రీలోనూ పాపుల‌రైంది. అందాల పోటీల్లోనూ నిధి టాప్ స్లాట్ లో రాణించింది. అటుపై నాగ‌చైత‌న్య‌.. అఖిల్ సినిమాల్లో న‌టించి అక్కినేని క‌థానాయిక‌గా పాపుల‌రైంది. ఇటీవ‌లే రామ్ స‌ర‌స‌న ఇస్మార్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. అయినా ఎందుక‌నో అవ‌కాశాలు రావ‌డం లేద‌ట‌. టాలీవుడ్ బాలీవుడ్ లో అవ‌కాశాలు వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి ఇప్పుడు పూర్తిగా త‌గ్గిపోవ‌డం నిధికి షాకిస్తోంది. ఒక ర‌కంగా నిధిని రిజెక్ట్ చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. అయితే ఇందుకు కార‌ణ‌మేమిటి? అంటే.. మెరుపుతీగ‌లాంటి ఈ అమ్మ‌డు ఇటీవ‌ల కాస్త బొద్దెక్కింద‌ట‌. అది కూడా త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో రాణించేందుకు ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని చెబుతున్నారు. అయితే బొద్దెక్క‌డం వ‌ల్ల‌నే నిధికి ఛాన్సులు రావ‌డం లేదా? లేక ఇంకేదైనా కార‌ణ‌మా? అన్న‌ది త‌నే చెప్పాల్సి ఉంటుంది.