Begin typing your search above and press return to search.

అల్లరోడికి అందుకే ఒకే చెప్పిందట

By:  Tupaki Desk   |   4 Sept 2017 11:00 PM IST
అల్లరోడికి అందుకే ఒకే చెప్పిందట
X
గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న హీరో అల్లరి నరేష్. ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని మలయాళం లో హిట్ అయిన "ఓరు వడక్కన్ సెల్ఫీ" అనే కామెడీ థ్రిల్లర్ కథని తెలుగులో "మేడ మీద అబ్బాయి" గా తెస్తున్నాడు. సినిమా హిట్ కావాలని చాలా కష్టపడుతున్నాడు నరేష్. అందుకోసం ఒరిజినల్ కథను తెరకెక్కించిన దర్శకుడినే ఈ సినిమాకి ఎంపిక చేసుకున్నాడు.

ఇక హీరోయిన్ విషయంలో కూడా అల్లరోడు ఈ సారి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. మలయాళం - తమిళ్ లో కుర్ర హీరోల ఫెవరేట్ హీరోయిన్ గా మారిన నిఖిలా విమల్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే ఈ ముద్దుగుమ్మ ఇంతకుముందు వచ్చిన కొన్ని టాలీవుడ్ ఆఫర్స్ ని రిజెక్ట్ చేసిందట. కేవలం నరేష్ సినిమాను ఎందుకు ఒకే చేశారన్న ప్రశ్నకు ఈ విధంగా సమాధానం చెప్పింది. నాకు తెలుగు అంత బాగా తెలియదు. ఒక సినిమాలో నటించాలంటే ఎంతో కొంత భాషపై అవగాహన ఉండాలి అనుకుంటా.. కానీ మేడ మీద అబ్బాయి సినిమా కథని ఒకే చేయడానికి ఈ సినిమా దర్శకుడు జి.ప్రజిత్ మలయాళీ దర్శకుడే కావడంతో అతని గురించి బాగా తెలుసని అతని డైరెక్షన్ లో చేయడం ఈజీగా ఉంటుందని ఒప్పుకుందట. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్-మహేష్ బాబు వంటి హీరోలు తెలుసని అల్లరి నరేష్ సినిమాలు కూడా ఆయన పరిచయమైన తర్వాత చూశానని నిఖిలా చెప్పుకొచ్చింది.

ఇక గ్లామర్ తరహా పాత్రలను గురించి స్పందిస్తూ.. అలాంటి పాత్రలను అస్సలు చేయనని చెబుతూ కేవలం పెర్ఫామెన్స్ - ఓరియెంటెడ్ కథలకు మాత్రమే ఒకే చెబుతానని చెప్పింది. ప్రస్తుతం ఈ అమ్మడు రంగా అనే ఓ తమిళ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉంది. అలాగే తెలుగులో మోహన్ బాబు - మదన్ డైరెక్షన్ లో రాబోతున్న "గాయత్రి" సినిమాలో మోహన్ బాబు కూతురిగా కనిపించబోతోంది.