Begin typing your search above and press return to search.

నాని ' V' చేయడానికి రీజన్ అదే !

By:  Tupaki Desk   |   17 Feb 2020 4:14 PM GMT
నాని  V చేయడానికి రీజన్ అదే !
X
ఏ హీరో అయినా తన ల్యాండ్ మార్క్ సినిమా విభిన్నంగా ఉండాలనే ఆలోచిస్తాడు. ఆ సినిమా నుండి కొత్త జర్నీ స్టార్ట్ చేయాలని చూస్తాడు. సరిగ్గా నాని ఇప్పుడు అదే చేస్తున్నాడు. లిస్టులో చాలా మంది దర్శకులన్నా ఇంద్రగంటి మోహన కృష్ణ చెప్పిన క్యారెక్టర్ కి ఇంప్రెస్ అయిపోయాడు నాని. సరిగ్గా తన 25 సినిమా ఎలా ఉండాలనుకున్నాడో అలాంటి స్క్రిప్ట్ రావడంతో కళ్ళు మూసుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.

అయితే నాని కథ విన్నప్పుడు సినిమాలో రోల్ చాలా చిన్నది. కాకపోతే నెగిటివ్ రోల్ కావడంతో నటుడిగా ఇంకా మెరుగు పడే అవకాశం ఉందని ఒకే అనేశాడు. కానీ షూటింగ్ కెళ్ళే సరికి కథలో మార్పులు జారిగాయి. నాని క్యారెక్టర్ కి స్క్రీన్ స్పేస్ పెంచారు. మొదట షూట్ చేసిన సన్నివేశాలు బాగా రావడం పైగా నాని 25 సినిమా అవ్వడంతో గెస్ట్ రోల్ లా ఉండకూడదని దర్శకుడు , నిర్మాత కథలో మార్పులు చేసారు.

సో ఫైనల్ గా నాని క్యారెక్టర్ పెరిగి సినిమాకు కీలకంగా మారింది. లేటెస్ట్ గా రిలీజైన టీజర్ చూస్తే నాని అసలు ఈ సినిమా ఎందుకు చేసాడన్నది క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. మరి తన విలనీ క్యారెక్టర్ తో నేచురల్ స్టార్ మెప్పించి నిజంగానే ఈ సినిమాను స్పెషల్ గా మార్చుకుంటాడా చూడాలి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిషింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమా మార్చ్ 25 థియేటర్స్ లోకి వస్తోంది.