Begin typing your search above and press return to search.

మనోజ్ ఓపెన్ స్టేట్మెంట్ కి అదే కారణమా?

By:  Tupaki Desk   |   3 April 2016 11:00 PM IST
మనోజ్ ఓపెన్ స్టేట్మెంట్ కి అదే కారణమా?
X
మొన్న ఎటాక్ సినిమాతో మనల్ని పలకరించిన మంచు మనోజ్ నిన్న ట్విట్టర్ లో షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కాంబినేషన్ల కారణంగా ఉత్సాహాన్ని పెంచిన రామ్ గోపాల్ వర్మ ఎటాక్ ప్రేక్షకులమీదకు మన రామూ చేసిన ఎటాక్ అని విమర్శకులు ఏకి పారేశారు. అప్పట్లో రామూ తీసిన రౌడి సినిమానే కాస్త కెమెరాని అటు తిప్పి ఇటు తిప్పి తీశాడని, అదికూడా మెప్పించలేకపోయిందని క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు.

అయితే ఈ విషయాన్ని నేనూ ఏకీభవిస్తున్నానని మనోజ్ చేసిన ట్వీట్ నిన్న ఆశ్చర్యపరిచింది. ఎంత చెత్త సినిమా తీసినా సమర్దించుకునే హీరోల మధ్య మనోజ్ స్టేట్ మెంట్ ప్రత్యేకంగా నిలిచినా దీనికి కారణాలు మాత్రం అనేకం కనబడుతున్నాయి. రామూ మంచు ఫ్యామిలీ అందరితోనూ సినిమాలు తీశాడు. ఒక్క రౌడి తప్ప అనుక్షణం - దొంగలముఠా - ఎటాక్ అన్నీ నిరాశపరిచాయి. ఇక రాము ఎలానో తెలుగు సినిమాలు తీయడనే స్టేట్ మెంట్ వున్న కారణంగా రాముతో బాండింగ్ లేదని తెలుపుతూ ఈ స్టేట్ మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

అంతేకాక వైవిధ్యమైన సినిమాల ధోరణి వదిలి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తూ శౌర్య - ఎటాక్ లతో రెండు ఫ్లాపులు తెచ్చుకున్న తనపై పాజిటివిటి కోసం కూడా మనోజ్ ఈ ప్రయోగం చేసినట్టు అర్ధమవుతుంది. దీనిబట్టి మనోజ్ స్టేట్మెంట్ కూడా సేఫ్ గేమ్ అన్నమాట.