Begin typing your search above and press return to search.

కళ్యాణ్ పక్కన 'దేవ్' ఎందుకు

By:  Tupaki Desk   |   31 Jan 2018 9:23 AM GMT
కళ్యాణ్ పక్కన దేవ్ ఎందుకు
X
మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీకి ఈ రోజు ముహూర్తం సెట్ చేసి లంఛనంగా షూటింగ్ మొదలు పెట్టేసారు. చిరు చిన్న కూతురు శ్రీజ భర్తగా కళ్యాణ్ అప్పుడు ఘనంగా జరిగిన పెళ్లి వేడుక ద్వారా అందరికి సుపరిచితుడే. సినిమాల్లో నటించాలి అనే బలమైన కోరికను ముందు నుంచే ఉన్న కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ కానుగంటి. గత ఆరు నెలలుగా ఫోటో షూట్ చేయించుకోవడంతో పాటు నటనకు సంబంధించిన మెలకువలు నేర్చుకోవడంలో బిజీ బిజీగా గడిపాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వాళ్ళకు తన పేజి ద్వారా రెగ్యులర్ టచ్ లోనే ఉన్నాడు. ఇవాళ ప్రారంభోత్సవం సందర్భంగా కళ్యాణ్ పేరుని కళ్యాణ్ దేవ్ గా ప్రకటించడం మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. దేవా అని అతని అసలు పేరులో లేదు. మరి ఎందుకు జత చేసారు అనేదానికి సమాధానం దొరికింది.

మొదటి సినిమా అందులోనూ పోటీ విపరీతంగా ఉన్న పరిస్థితుల్లో పరిశ్రమలో అడుగుపెడుతున్నాడు కాబట్టి విజయం వరించాలి అనే లక్ష్యంతో న్యుమరాలజి ప్రకారం ఇది సెట్ చేసారట. కళ్యాణ్ పేరు లో ఒక ఎ జోడించి దేవ్ లో కూడా ఒక అక్షరం హెచ్ జోడించి మొత్తంగా కళ్యాణ్ దేవ్ అని సిల్వర్ స్క్రీన్ నేమ్ గా ఫిక్స్ చేసారట. దీని కోసం కూడా పెద్ద కసరత్తే జరిగిందని టాక్. పైగా చిన్న మావయ్య పేరు కూడా కళ్యాణ్ కాబట్టి ఇబ్బంది లేకుండా దేవ్ అని జోడిస్తే బాగుంటుంది అనే సలహాను పరిగణనలోకి తీసుకున్నట్టు టాక్.

ఇప్పుడు కళ్యాణ్ దేవ్ ఎంట్రీతో మెగా హీరోల రాక ఆగబోవటం లేదు. సాయి ధరం తేజ్ తమ్ముడు కూడా ఫీల్డ్ లోకి దూకాలని మహా ఉత్సాహంగా ఉన్నాడు. మరో ఆరు నెలల్లో తను కూడా ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందరు వచ్చినా ఎవరి టాలెంట్ తో వాళ్ళు సినిమాలు చేసుకుంటూ పోతుండటంతో నెంబర్ ఎంత అని ఎవరు పట్టించుకోవడం లేదు. ఏ రకంగా చూసుకున్నా ఒక స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి ఇందరేసి హీరోలు రావడం మాత్రం మెగాస్టార్ సాధించిన మరో రికార్డు గా చెప్పుకోవచ్చు.