Begin typing your search above and press return to search.

'ఇజం' ఆపేయడానికి అసలు కారణం?

By:  Tupaki Desk   |   16 Sept 2016 5:54 PM IST
ఇజం ఆపేయడానికి అసలు కారణం?
X
నిజానికి నందమూరి కళ్యాణ్‌ రామ్ హీరోగా డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్ డైరక్షన్లో రూపొందిన ''ఇజం'' సినిమాను సెప్టెంబర్ లోనే రిలీజ్ చేయాలి. అయితే ఈ నెల 23న వస్తుందని అనుకున్న సినిమాను.. ఏకంగా దసరా కూడా దాటించేసి అక్టోబర్ 3వ వారంలో రిలీజ్ అంటున్నారు. ఇంతకీ ఈ సినిమాను ఆపేసి పోస్టుపోన్ చేయడానికి కారణం ఏంటంటారు?

సినిమాలో కొన్ని సీన్లను ప్రస్తుతం రీ-షూట్ చేస్తున్నారని ఫిలిం నగర్లో కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి కాని.. అలాంటిదేం లేదట. అఫ్‌ కోర్స్ రీషూట్ చేసినా కూడా పెద్ద ప్రాబ్లమ్ ఏమీ లేదు కాని.. ఎందుకంటే ధియేటర్లలోకి వచ్చేముంది ఎంతవరకు సినిమాను అద్భుతంగా తీర్చదిద్దగలిగితే అంత బెటర్. అయితే 'ఇజం' విషయంలో మాత్రం సరైన రిలీజ్ డేట్ కోసమే వెయిటింగ్ అంటున్నారు. ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలన్నీ.. రిలీజ్ డేట్ ను సరిగ్గా చూసుకుని హ్యాపీగా ఖాళీగా ఉన్న రోజున రిలీజ్ చేస్తే.. ఓపెనింగులు భారీగా వస్తున్నాయి. అందుకే దసరా రేసులో గుంపులో గోవిందం టైపులో ఇప్పటికే ఉన్న అరడజను సినిమాలతో జాయినవ్వకుండా.. జాగ్రత్తపడదాం అని కళ్యాణ్‌ రామ్ డెసిషన్ తీసుకున్నట్లు టాక్.

ఎప్పుడూ కొత్త కొత్త హీరోయిన్లను టాలీవుడ్ కు అందించే పూరి జగన్ ఈసారి మిస్ ఇండియా బ్యూటి అదితి ఆర్య ను టాలీవుడ్ కు 'ఇజం' ద్వారా పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆమె ఒక ముస్లిం యువతి పాత్రలో నటిస్తోంది.