Begin typing your search above and press return to search.

వరంగల్ పిల్ల అందుకే అవుట్!!

By:  Tupaki Desk   |   7 Nov 2016 10:30 PM GMT
వరంగల్ పిల్ల అందుకే అవుట్!!
X
వరంగల్ పిల్లగా ఫ్యామస్ అయిన హీరోయిన్ ఎవరో కాదు.. ఈషా అనే చెప్పాలి. అమ్మడు 'అంతకు ముందు ఆ తరువాత' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత చాలా సినిమాల్లో నటించింది. కాకపోతే మాంచి బ్రేక్ మాత్రం రాలేదు. కాని ఇప్పడు అమ్మడికి వంశీ తీస్తున్న లేడీస్ టైలర్ సీక్వెల్ లో ఛాన్సు వచ్చినట్లే వచ్చి మిస్సయ్యింది. అయితే ఈమె ఆ సినిమాను ఎందుకు మిస్సయ్యిందంటే..

నిజానికి సీనియర్ డైరక్టర్ అయిన వంశీ.. చాలా విషయాల్లో చాలా స్ర్టిక్ట్. అలాగే కాస్త గోదావరి జిల్లాల యాసతోపాటు సెటైర్ కూడా మాటల్లో గట్టిగానే పలుకుతుంది. ఇక అమ్మడు త్వరలో మొదలవ్వనున్న సాంగ్స్ షూట్లో జాయిన్ అవుతుంది అనగా.. ఇండస్ర్టీలోని కొందరు సన్నిహితులు వంశీతో పనిచేయడం చాలా కష్టం అంటూ ఆమెకు చెప్పారట. దానికితోడు రెండు మూడు మీటింగుల్లో వంశీ కూడా కాస్త ఠంచన్ గా నాకు ఇది కావాలి.. ఇలా ఉండాలి.. అని చెప్పడంతో.. ఆ పంచ్ లకు దడుచుకుని ఈ అమ్మాయి సినిమా నుండి తప్పుకుంది అని తెలుస్తోంది. ఇప్పుడు ఆమె స్థానంలో మనాలి రాథోడ్ అనే కొత్తమ్మాయి వచ్చింది.

ఈ మధ్య కాలంలో సరైన హిట్టులేని వంశీ.. ఇప్పుడు మధుర శ్రీధర్‌ ప్రొడక్షన్లో సుమంత్ అశ్విన్ హీరోగా ''ఫ్యాషన్ డిజైనర్.. సన్నాఫ్‌ లేడీస్ టైలర్'' అనే సినిమాను చేస్తున్నాడు. ఈసారి హిట్టు కొట్టడం తప్పనిసరి అంటున్నాడులే. వెయిట్ అండ్ సీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/