Begin typing your search above and press return to search.

తన కొంప కూల్చిందనే పగబట్టేశాడట

By:  Tupaki Desk   |   11 July 2017 7:02 AM GMT
తన కొంప కూల్చిందనే పగబట్టేశాడట
X
ఒక స్టార్ హీరోయిన్ పై కారులో జరిగిన ఘోరానికి ఫైనల్ గా ఒక ఎండింగ్ లభిస్తున్నట్లే ఉంది. ఈ పాపులర్ మల్లూ హీరోయిన్ ను అప్పట్లో ఆమె మాజీ డ్రైవర్ మరియు కొందరు కలసి కారులో ఎక్కడికో తీసుకెళ్లి.. అసభ్యమైన రీతిలో ఒక వీడియో తీసి.. దానిని బయటపెట్టేస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే దీని వెనుక ఒక పెద్ద హీరో ఉన్నాడని అప్పట్లో కామెంట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఫైనల్ గా పాపులర్ హీరో దిలీప్ ను నిన్న సాయంత్రం పోలీసులు అరెస్టు చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే అసలు దిలీప్ ఇలా ఎందుకు చేసుంటాడు?

ఈ విషయంపై మలయాళ పత్రికల్లో కొన్ని ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ మధ్యనే దిలీప్ ఒక సినిమాలో సదరు హీరోయిన్ తో నటించాడు. ఆ సమయంలో ఫారిన్లో షూట్ చేస్తున్నప్పుడు మనోడు హీరోయిన్ కావ్యా మాధవన్ తో ప్రేమకలాపాలు సాగిస్తున్నాడట. అప్పటికే హీరోయిన్ మంజూ వారియర్ ను పెళ్ళి చేసుకున్న దిలీప్.. ఇలా చేయడం సహించలేకపోయిన ఈ క్యూట్ హీరోయిన్.. మంజూ తనకు స్నేహితురాలు కాబట్టి.. వీరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిందట. వారి డైవర్స్ కు ప్రధాన కారణం ఈ అమ్మాయి ఇలా రెడ్ హ్యాండెడ్ గా పట్టించడమే. ఆ తరువాత కొన్నాళ్ళకు కూలిపోతున్న తన కాపురానికి డైవర్స్ తో ముగింపు పలికిన దిలీప్.. కావ్యను వివాహం కూడా చేసుకున్నాడు. కాకపోతే తన కొంప కూలడానికి కారణమైన హీరోయిన్ పై పగ పెంచుకున్నాడు. అందుకే ఆమెకు సినిమాల్లో ఛాన్సులు రాకుండా చేయాలని.. ఇలా వీడియోలు తీసి లీక్ చేస్తే ఇక పెద్ద హీరోలు ఆమె ముఖం చూడరని ఫీలయ్యి.. ఇలా ప్లాన్ చేశాడని అక్కడి మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.

ఏదేమైనా మొన్నటివరకు తానో అమాయకుడినని.. పల్సర్ సునీల్ అనే రౌడీ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చెప్పిన దిలీప్.. ఇప్పుడు అదే పల్సర్ సునీల్ కు అసలు డబ్బులిచ్చి ఒక హీరోయిన్ ను సెక్సువల్ గా హరాస్ చేసి వీడియో రికార్డు చేయమని చెప్పింది అతననే తెలిస్తే.. నిజంగానే అది చాలా పెద్ద సినిమాటిక్ షాక్ అనే చెప్పాలి.