Begin typing your search above and press return to search.

అందుకే నితిన్ సినిమా లేట్ అయిందట

By:  Tupaki Desk   |   13 Jun 2019 8:31 AM GMT
అందుకే నితిన్ సినిమా లేట్ అయిందట
X
యంగ్ హీరో నితిన్ కొత్త సినిమా 'భీష్మ' ను నిన్నే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను అధికారికంగా లాంచ్ చేయడంతో గతకొన్ని నెలలుగా 'భీష్మ' పై ప్రచారంలో ఉన్న కొన్ని గాసిప్స్ కు తెరపడినట్టయింది.

నితిన్ లాస్ట్ సినిమా 'శ్రీనివాస కళ్యాణం' పోయినేడాది ఆగష్టులో విడుదలయింది. ఈ సినిమా తర్వాత మంచి కథలు ఎంపిక చేసుకోవాలనే ఉద్దేశంతో నితిన్ కొంత గ్యాప్ తీసుకున్నాడు.. చాలా కథలు విన్న తర్వాత తర్వాత వెంకీ కుడుముల వినిపించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ స్టొరీ 'భీష్మ' నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ అప్పటికి వెంకీ కుడుముల నితిన్ కు జస్ట్ స్టొరీ మాత్రమే వినిపించాడట. స్క్రిప్ట్ ను పక్కాగా తీర్చిదిద్దేందుకు వెంకీ ఎక్కువ సమయం తీసుకున్నాడు. మరోవైపు నితిన్ కూడా స్క్రిప్ట్ ను పకడ్బందీగా తయారు చేసేంతవరకూ వేచి చూడాలని.. గత సినిమాల విషయంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ చేయకూడదనే ఆలోచనతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యేవరకూ ఓపిగ్గా వెయిట్ చేశాడని సమాచారం. అందుకే నితిన్ కు పది నెలల గ్యాప్ వచ్చిందని.. అంతకు మించి మరేమీ లేదని 'భీష్మ' టీమ్ కు సన్నిహితంగా ఉండేవారు అంటున్నారు.

అయితే ఈ సినిమాను లాంచ్ చేసే లోపే మరో రెండు మంచి కథలు రావడంతో వాటిని కూడా లైన్ లో పెట్టాడు. దీంతో 'భీష్మ' ను సైడ్ లైన్ చేశారనే రూమర్లు మొదలయ్యాయి. కానీ నితిన్ మాత్రం వెంకీ కుడుములకు ఇచ్చిన కమిట్ మెంట్ కు కట్టుబడి ఉన్నాడట. అందుకే నితిన్ లైన్ లో పెట్టిన ఇతర ప్రాజెక్టుల స్క్రిప్ట్ వర్క్ పూర్తయినా.. ముందుగా ఇచ్చిన కమిట్ మెంట్ ప్రకారం వెంకీ కుడుముల చిత్రాన్నే పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడని అంటున్నారు. 'భీష్మ' కథ నితిన్ చాలా నచ్చిందని.. తనకు ఖచ్చితంగా విజయాన్ని అందిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడని ఇన్ సైడ్ టాక్.