Begin typing your search above and press return to search.
'అల్లు' ఎంత పనిచేసే..'భాషా' మూవీని వదిలేసుకున్న చిరంజీవి
By: Tupaki Desk | 14 Dec 2020 3:00 PM IST'ఈ భాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే'. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన 'భాషా' సినిమా లోనిది ఈ డైలాగ్. ఈ ఒక్క డైలాగే కాదు.. ఆ సినిమాలోని డైలాగులు అన్నీ సూపరే. ఆ సినిమా విడుదలై పాతికేళ్లు అవుతున్నా అందులోని డైలాగులను జనాలు ఇప్పటికీ చెబుతుంటారు. ఈ సినిమా విడుదలకు ముందు తమిళనాడులో రజినీకాంత్ ఆ రాష్ట్రానికి పరిమితమైన ఒక స్టార్ హీరో మాత్రమే. కానీ భాషా విడుదలైన తర్వాత రజినీకాంత్ దేశంలోనే నెంబర్వన్ హీరో అయ్యాడు. దేశంలోనే కాదు జపాన్, మలేషియా, సింగపూర్ తదితర దేశాల్లో భాషా సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఒక్కసారిగా రజినీకాంత్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించాడు. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ కారణంగానే ఆయన నటించిన తర్వాత సినిమాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా అందరికీ చేరువయ్యాయి.
మెగాస్టార్ చిరంజీవి, విజయబాపినీడు కాంబినేషన్ లో 1991 లో విడుదలైన గ్యాంగ్ లీడర్ సంచలన విజయం సాధించింది. దీంతో చిరంజీవి అదే డైరెక్టర్ తో మళ్ళీ బిగ్ బాస్ అనే సినిమాను ప్రారంభించారు. ఆ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతుండగా కోలీవుడ్లో రజినీకాంత్ హీరోగా భాషా సినిమా చేస్తున్న దర్శకుడు సురేష్ కృష్ణ చిరంజీవిని కలిశారట. తాను రజనీకాంత్ తో చేస్తున్న భాషా సినిమా తెలుగులో మీరు చేస్తే బాగుంటుందని కథ వినిపించారట.
అయితే ఈ కథ మెగాస్టార్ కి చాలా బాగా నచ్చిందట. ఆ సినిమాను తెలుగులో బిగ్ బాస్ పేరుతో చేద్దాం.. అని చెప్పి నిర్ణయించుకున్నాడట. తెలుగులో చేసేందుకు రీమేక్ హక్కులు తీసుకోవాలని చిరంజీవి అల్లు అరవింద్ కు పురమాయించాడట. అల్లు అరవింద్ భాషా నిర్మాతను కలవగా తెలుగు రీమేక్ హక్కులను అతడు రూ.40 లక్షలుగా చెప్పాడట. అయితే అల్లు అరవింద్ మాత్రం పాతిక లక్షలకు బేరం ఆడారట. అందుకు భాషా నిర్మాతలు అంగీకరించకపోవడంతో చిరంజీవి ఆ సినిమాని వదిలేసుకున్నారట.
1995లో భాష తమిళ, తెలుగు వర్షన్ ఒకేసారి విడుదలై సంచలన విజయం సాధించింది. ఆ సినిమాతో రజనీకాంత్ ఇమేజ్ ఆకాశాన్ని తాకింది. నిజంగా ఆ సినిమాను తెలుగులో చిరంజీవి గనక చేసి ఉంటే సూపర్ హిట్ గా నిలిచేది. ఒక మంచి చిత్రాన్ని అల్లు అరవింద్ బేరం కుదరక చిరంజీవి మిస్ చేసుకున్నారు. మరో వైపు అదే యేడాది చిరంజీవి, విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన బిగ్ బాస్ సినిమా ప్లాప్ గా నిలిచింది. ఒక మంచి సినిమా రీమేక్ చేసే అవకాశం కోల్పోవడంతో పాటు ఒక డిజాస్టర్ మూటగట్టుకొని ఆ ఏడాది చిరంజీవి నిరాశలో మునిగిపోయారు. ఒక వేళ చిరంజీవి భాషా సినిమా గనక చేసి ఉంటే ఫ్యాన్స్ పండగ చేసుకునే వారేమో.