Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ముంబైకి ఎందుకు వెళ్లారంటే

By:  Tupaki Desk   |   3 Jan 2018 6:00 PM IST
మెగాస్టార్ ముంబైకి ఎందుకు వెళ్లారంటే
X
2017 లో బాహుబలి టాలీవుడ్ స్థాయిని చాలా వరకు పెంచేసిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరో ప్రభాస్ కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకు అతను చాలా కష్టపడ్డాడు అని చెప్పవచ్చు. ఇక 2018లో కూడా అలాంటి ఒక సినిమానే రాబోతోంది. అదే సైరా. మెగాస్టార్ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆ సినిమాపై ప్రస్తుతం ఇతర ఇండస్ట్రీ మీడియాలు కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి.

అయితే భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోన్న ఆ సినిమా కోసం మెగాస్టార్ తన కెరీర్ లో ఎన్నడు కష్టపడని విధంగా సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా చిరంజీవి గారు ఎవరు ఊహించని విధంగా ముంబై ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. దీంతో ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు. మెగాస్టార్ అంటే అన్ని ఇండస్ట్రీల వారికీ తెలుసు. మన సౌత్ జనాలు మెగాస్టార్ ని చూసి ఆయనని కలుసుకునేందుకు ఎగబడ్డారు కూడా. ఇకపోతే అసలు మెగాస్టార్ అక్కడికి ఎందుకు వెళ్లారు అనే ప్రశ్న ప్రస్తుతం అందరిలోనూ కలిగింది. రాజకీయ పరంగా ఏవైనా మీటింగ్స్ కి వెళ్లారా అంటే ఆ విషయంలో నిజం లేదని తెలిసిందే.

అసలు మ్యాటర్ ఏమిటంటే.. మొన్నటి వరకు మెగాస్టార్ మీసాలతో వెరైటీ గెడ్డం తో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే సైరా సినిమాలో సిజి వర్క్స్ కోసం క్లీన్ గా షేవ్ చేసుకొని ముంబయి కి వెళ్లారట. కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్లో సిజి వర్క్ కోసమని అక్కడే ఉన్నారట. అక్కడ మెగాస్టార్ ముఖాన్ని మోషన్ క్యాప్చర్ సాయంతో గ్రాఫిక్స్ వారు క్యాప్చర్ చేయనున్నారట. రీసెంట్ గా సురేందర్ రెడ్డి సినిమాకు సంబందించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక మరికొన్ని రోజుల తరువాత ఒక భారీ సెట్ లో సైరా షూటింగ్ కంటిన్యూ అవ్వనుంది.