Begin typing your search above and press return to search.

హోటల్లో జరిగిన సీన్‌ వేరయా

By:  Tupaki Desk   |   8 Dec 2015 10:30 PM GMT
నిజానికి ఈ మధ్యన ఒక న్యూస్‌ రిపోర్టు చేయబడుతున్న స్టయిల్‌ చూస్తుంటే.. అది న్యూసా రూమరా అనేంత సందేహం వచ్చేస్తోంది. ఎందుకంటే మనోళ్లు యాడ్‌ చేస్తున్న మసాలా చూస్తుంటే.. అసలు నమ్మాలో వద్దో తెలియని పరిస్థితి. అయితే టాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ ఒకయానపై వచ్చిన గాసిప్‌ ఆ మధ్యన తెగ హల్‌ చల్‌ చేసింది. కాని ఆ గాసిప్‌ లో మరో నిజం ఉందని ఇప్పుడు తెలుస్తోంది.

ఒక ప్రముఖ స్టార్‌ డైరక్టర్‌.. ఆయన స్నేహితులు (వాళ్లూ ప్రముఖ డైరక్టర్‌, రైటర్లే).. అలాగే ఒక ప్రముఖ హీరోయిన్‌.. వీరందరూ ఒక స్టార్‌ హోటల్‌ లాబీలో కూర్చొని సరదాగా ముచ్చట్లు పెట్టారు. సాయంత్రం 6 గంటలకు మొదలైన వీరి బాతాఖానీ.. రాత్రి 12 దాటి.. తెల్లాగట్ల నాలుగింటివరకు కొనసాగింది. కాని మీటింగ్‌ పెట్టుకుంది హోటల్‌ లాబీలోనే. అక్కడ పెద్ద సీక్రెసి ఏమీ లేదు. ఇంతలో మన స్టార్‌ డైరక్టర్ వైఫ్‌ మొగుడి సెల్‌ ఫోన్‌ స్విఛాఫ్‌ అని రావడంతో ఏమైందో అని ఖంగారుపడుతూ హోటల్ కు వచ్చింది. ఏంటండీ ఇంత సేపు సోదా.. నాలుగైంది.. పదండి ఇంటికి అంటూ.. అక్కడున్న వారితో కాసేపు ఆమె కూడా ముచ్చట్లు పెట్టుకొని.. 5.30కి ఇంటికెళ్లారట మొగుడూ పెళ్ళాళ్లిద్దరూ. ఇది అసలు సీన్‌.

కాని బయటకు వచ్చిన రూమర్‌ ఏంటంటే.. హోటల్‌ కు వెళ్లి.. వేరే హీరోయిన్‌ తో కలిసున్న తన భర్తను రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకొని.. బూతులు తిట్టిన సా్టర్‌ వైఫ్‌ అంటూ తెగ వార్తలొచ్చేశాయి. అయ్యా.. అక్కడ జరిగిన సీన్‌ వేరయా. ఇంత బూతు అక్కడ స్ఫురించలేదు.