Begin typing your search above and press return to search.

హీరో హీరోయిన్ రహస్య పెళ్లికి కారణం అదా..!

By:  Tupaki Desk   |   1 Sep 2022 8:40 AM GMT
హీరో హీరోయిన్ రహస్య పెళ్లికి కారణం అదా..!
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ కత్రీనా కైఫ్ పలు ప్రేమ వ్యవహారాలు సాగించిన విషయం తెల్సిందే. ఆమె బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. ఎన్నో సార్లు వార్తల్లో నిలిచిన కత్రీనా కైఫ్ గత ఏడాది బాలీవుడ్ యంగ్‌ హీరో విక్కీ కౌషల్ ని వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరు ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ బ్యూటీఫుల్‌ కపుల్ గా పేరు దక్కించుకున్నారు.

ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను చూపించుకుంటూ ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నా కూడా భార్య భర్త లుగా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. వీరిద్దరి వివాహం కు మీడియా వారు ఇంకా ఇండస్ట్రీకి చెందిన కొందరికి ఆహ్వానం దక్కలేదు.

పైగా పెళ్లి పూర్తిగా ఒక రహస్యం అన్నట్లుగా సాగించారు. అతి కొద్ది మందిని మాత్రమే పిలిచి అంత సీక్రెట్‌ గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటంటూ ఆ సమయంలో చాలా మంది ప్రశ్నించారు.

ఇద్దరు కూడా బాలీవుడ్‌ స్టార్స్.. వారిద్దరికి కూడా భారీ ఎత్తున అభిమానులు ఉండటంతో పాటు ఎంతో ఇండస్ట్రీ సన్నిహితులు ఉన్నారు. వారిని కూడా ఎందుకు ఆహ్వానించలేదు అంటూ చాలా మంది ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు తాజాగా కత్రీనా కైఫ్ నుండి సమాధానం లభించింది. తాజాగా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుల వేడుకలో భాగంగా కత్రీనా ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఆ ఇంటర్వ్యూలో తమ పెళ్లి ఏడాది క్రితం అయ్యింది.. ఆ సమయంలో మా కుటుంబ సభ్యుల్లో కొందరు కరోనా బాధపడుతున్నారు. అంతే కాకుండా ఆ సమయంలో కరోనా భయం చాలా విపరీతంగా ఉంది.

కేవలం కరోనా భయం వల్లే పెళ్లిని రహస్యంగా చేసుకోవాల్సి వచ్చిందని కత్రీనా చెప్పుకొచ్చింది. మా కుటుంబం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగకూడదు అనుకుని తాము పెళ్లికి ఎక్కువ మందిని ఆహ్వానించలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.