Begin typing your search above and press return to search.

ఆర్థిక క‌ష్టాల్లో నాటి టాప్ హీరోయిన్‌?

By:  Tupaki Desk   |   4 April 2017 6:48 AM GMT
ఆర్థిక క‌ష్టాల్లో నాటి టాప్ హీరోయిన్‌?
X
ఆమె అందానికి నాటి త‌రం పిచ్చెక్కేది. ఆమెను వెర్రిగా అభిమానించేవారు. అంత‌కు మించి ఆరాధించేవారు. చీమ‌కుట్టిన పెదాలంటూ సినిమాలో ఆమెను వెక్కిరించినా.. ఆ పెదాల‌కు ఫ్లాట్ అయ్యేవారు అప్ప‌టి యువ‌త‌. అగ్ర‌శ్రేణి హీరోల‌తో ఆడిపాడిన ఆ హీరోయిన్ అప్ప‌ట్లో అగ్ర‌శ్రేణి హీరోయిన్స్‌ లో ఒక‌రు. కెరీర్ పీక్ స్టేజ్‌ లో ఉండ‌గా ల‌వ్ మ్యారేజ్ చేసుకున్న ఆమె ఉదంతం అప్ప‌ట్లో హాట్ టాపిక్‌ గా మారింది. ఇప్ప‌టికే అర్థ‌మై ఉంటుంది.. నాటి టాప్ హీరోయిన్ ఎవ‌రో? అవును.. మీ అంచ‌నా క‌రెక్టే. అల‌నాటి ఆ టాప్ హీరోయిన్ ఎవ‌రో కాదు.. భూమికా చావ్లా.

యోగా టీచ‌ర్‌ ను ప్రేమించి పెళ్లాడిన భూమిక‌.. త‌ర్వాతి కాలంలో సినిమాల‌కు దూర‌మైంది. అదే స‌మ‌యంలో నిర్మాణ సంస్థ‌ను ఏర్పాటు చేసి.. సినిమాలు తీసింది. అయితే.. ఆర్థికంగా న‌ష్ట‌పోవ‌టంతో కొంత‌కాలం సినిమాల‌కు దూరంగా ఉండిపోయింది. ఆర్థిక క‌ష్టాలు అంత‌కంత‌కూ పెరిగిపోతున్న వేళ‌.. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ మేక‌ప్ వేసుకొని తెర‌పైకి వ‌చ్చేందుకు డిసైడ్ అయ్యింది. మీద ప‌డిన వ‌య‌సుతో.. అక్కా.. వ‌దిన పాత్ర‌ల‌కైనా రెఢీ అంటూ చేసిన ప్ర‌య‌త్నాల‌తో ఎట్ట‌కేల‌కు హీరో నాని మూవీలో అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది.

క‌థ న‌చ్చ‌టంతోనే హీరో అక్క పాత్ర‌కు ఓకే చెప్పేసిన‌ట్లు చెబుతున్నా.. అదంతా ఉత్త‌మాటేన‌ని.. ఆర్థిక స‌మ‌స్య‌ల‌తోనే ఆ పాత్ర‌కు భూమిక ఓకే చెప్పేసింద‌ని చెబుతున్నారు. ఆ మ‌ధ్య విడుద‌లైన ధోని బ‌యోగ్ర‌ఫీలోనూ హీరో అక్క‌పాత్ర‌లో క‌నిపించిన భూమిక.. త‌న సెకండ్ ఇన్నింగ్స్‌ను షురూ చేసిన‌ట్లే చెప్పాలి. ధోనీ మూవీతో ఆమెకు పెద్ద‌గా పేరుప్ర‌ఖ్యాతులు రాలేదు. తాజాగా న‌టిస్తున్న నాని మూవీ అయినా త‌న‌కు అంతోఇంతో హెల్ప్ చేస్తుంద‌న్న ఆశ‌ల‌తో భూమిక ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/