Begin typing your search above and press return to search.
సిసలైన బాహుబలుడు రాజమౌళి
By: Tupaki Desk | 15 July 2015 12:33 PM ISTబాహుబలితో సూపర్‌స్టార్ అయ్యింది ఎవరు? ఈ ప్రశ్న వేస్తే ఎవరైనా ఇట్టే సమాధానం చెప్పేస్తారు. ఈ సినిమా వల్ల ప్రభాస్, రానాల కంటే రాజమౌళికే ఎక్కువ పేరొచ్చింది. ఎస్.ఎస్.రాజమౌళి రియల్ సూపర్‌స్టార్ అనిపించుకున్నాడు. ఇప్పుడు ప్రపంచమంతా అతడి పేరునే జపిస్తోంది. ఇలాంటి దర్శకుడిని మునుపెన్నడూ చూడలేదని ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారంతా. అయితే రాజమౌళికి ఇంత పేరు రావడానికి అసలు కారణం ఒకటి ఉంది.
బాహుబలిలో స్టార్లను, హీరోయిజాన్ని ఆవిష్కరించే కంటే అతడు ఎక్కువగా కథని ప్రెజెంట్ చేసేందుకే చూశాడు. అందమైన, ఛాలెంజింగ్‌గా ఉండే విజువల్స్‌ని చూపించగలగడమే ఇంత పేరు రావడానికి కారణం. టాలీవుడ్‌లో ఉన్న ఏ దర్శకుడైనా ముందు హీరోని ఎలివేట్ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటారు. మహేష్, చరణ్, పవన్, బన్ని వంటి స్టార్ల ఇమేజ్‌ని ఎక్కువగా ఎన్‌క్యాష్ చేసుకోవడానికి చూస్తుంటారు. కానీ రాజమౌళి అలా కాకుండా.. తాను ఓ అందమైన కథను అల్లుకుని, అందులోకి స్టార్లను ప్రవేశపెట్టాడు. అందువల్ల బాహుబలి అందరికీ నచ్చేసి.. రాజమౌళికి పేరొచ్చింది.
చందమామ కథల్లోని వీరుల్ని, వీరవనితల్ని తీసుకుని కథని అందంగా క్రియేట్ చేసుకున్నాడు కాబట్టే అతడికి ఇంత క్రేజ్ విజువల్స్‌ని ఎంతో ప్రేమించి ఊహించాడు కాబట్టే అతడు ఇప్పుడు సూపర్‌స్టార్ అయ్యాడు. ఇలా ఇంతకుముందు టాలీవుడ్‌లో ఒకే ఒక్క దర్శకుడు చేసేవారు. కృష్ణవంశీ హీరోల ఇమేజ్ కంటే కథకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. అందులో నటించినందుకు ఆ స్టార్లకు పేరొచ్చేది. ఇప్పుడర్థమైందా అసలు రాజమౌళి ఎందుకు సూపర్‌స్టార్ అయ్యాడో?