Begin typing your search above and press return to search.

అనుష్క అందుకే ఒప్పుకోవట్లే!

By:  Tupaki Desk   |   7 Dec 2017 11:00 PM IST
అనుష్క అందుకే ఒప్పుకోవట్లే!
X
టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టికి సౌత్ అంతా బోలెడంత క్రేజ్ ఉంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రస్తుత జనరేషన్ లో ఈమెను బ్రాండ్ అంబాసిడర్ అనేయచ్చు. అరుంధతితో అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. ఆ తర్వాత అంతటి హిట్ కొట్టకపోయినా.. బాహుబలిలో దేవసేనగా మెప్పించిన తీరు అసామాన్యం.

అయితే.. మధ్యలో సైజ్ జీరో చిత్రం కోసం లావుగా మారిన అనుష్క.. ఆ తర్వాత సన్నబడేందుకు చేసిన ప్రయత్నాలు అంతగా సక్సెస్ కాలేదు. అలాగని ఈమెకు వచ్చిన అవకాశాలకు లోటేమీ లేదు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ అజిత్ తో ఓ సినిమాలో నటించాల్సి ఉంది అనుష్క. వెంకటేష్- తేజ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్ గా తీసుకున్నారని అంటున్నారు. మరోవైపు అనుష్క నటించిన భాగమతి మూవీ జనవరి చివరి వారంలో విడుదల కానుంది. అయితే.. కొత్త సినిమాలను ఈ మధ్య అనుష్క ఒప్పుకోవడం లేదు. ఇందుకు కారణం.. సైజ్ తగ్గడం కోసమే అనుకున్నారంతా.

కానీ అనుష్క ప్రస్తుతం వెన్నునొప్పితో బాధ పడుతోందని తెలుస్తోంది. దీన్ని తగ్గించుకునేందుకు న్యాచురల్ థెరపీని ఆశ్రయించిందట. లావు తగ్గడం విషయంలో కూడా ఇదే ఇబ్బంది తలెత్తిందని తెలుస్తోంది. కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోవడంలో కూడా అందుకే ఆచితూచి వ్యవహరించిందట స్వీటీ. ప్రస్తుతం ఈ సమస్య నుంచి బయటపడిందని.. ఇకపై అనుష్క జోరు చూపించనుందని టాక్.