Begin typing your search above and press return to search.
ఆ యాక్సిడెంట్ వలనే అనుష్క అలా..
By: Tupaki Desk | 4 March 2017 10:52 AM ISTఅనుష్క శెట్టి లావుగా కనిపిస్తుండడం.. ఇప్పుడు చాలామంది అభిమానులతో పాటు ఫిలిం మేకర్స్ ను కూడా ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. అప్పట్లో సైజ్ జీరో చిత్రం కోసం దాదాపు 20 కిలోల బరువు పెరిగిన అనుష్క.. ఆ తర్వాత తగ్గడానికి చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు.
నిజానికి యోగ వంటి ప్రకృతిసిద్ధమైన పద్ధతులతో కొంత బరువు తగ్గినా.. మరో సిట్యుయేషన్ ఆమెను వెంటాడింది. సింగం 3 చిత్రంలో షూటింగ్ లో ఉన్నపుడు ఓ చిన్న యాక్సిడెంట్ కి గురికావడంతో.. గాయాల పాలైందిట స్వీటీ. దీంతో కొన్ని వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఈ సమయంలో యాంటీ బయాటిక్స్ కారణంగా.. డైట్ పాటించడం.. ఎక్సర్ సైజులు చేయడం లాంటివి కుదరలేదు. ఈ సమయంలో మళ్లీ తిరిగి బరువు పెరిగిపోయింది అనుష్క.
అందుకే ఓం నమో వెంకటేశాయ.. సింగం 3 చిత్రాల్లో అనుష్క లావుగా కనిపించింది. అయితే ఇప్పుడు మళ్లీ వర్కవుట్స్ చేస్తుండడంతో.. బరువు తగ్గుతోందని తెలుస్తోంది. ఈ చిత్రాలతో పోల్చితే.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న భాగమతి మూవీలో స్వీటీ సన్నగా కనిపించనుందని అంటున్నారు. ఈ చిత్రం ప్రధానంగా అనుష్క రోల్ పైనే నడవనుండడంతో.. మరింత కేర్ తీసుకుంటోంది ఈ సొగసరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/