Begin typing your search above and press return to search.

అందుకే ఫుల్ పాజిటివ్ గా ఉందట

By:  Tupaki Desk   |   23 Jan 2019 5:55 AM GMT
అందుకే ఫుల్ పాజిటివ్ గా ఉందట
X
అఖిల్ అక్కినేని మూడో సినిమా 'Mr. మజ్ను' మరో రెండు రోజుల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. అఖిల్ నటించిన మొదటి రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరచడంతో అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రోమోలు అన్ని ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో అఖిల్ తో పాటుగా అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారు.

ఇదొక్కటే కాకుండా రిలీజ్ టైమింగ్ కూడా అఖిల్ కు ఫుల్ గా కలిసివచ్చేలా ఉంది. సంక్రాంతి సినిమాల్లో 'F2' తప్ప మిగాతా అన్ని సినిమాల రన్ పూర్తి కావడం ఒక ప్లస్ అయితే 'Mr.మజ్ను' విడుదలయ్యే సమయానికి 'F2' జోరు కూడా కాస్త తగ్గే ఉంటుంది. అంతే కాదు 'Mr.మజ్ను' కు పోటీ కూడా లేకపోవడం కలిసి వచ్చే అంశమే. రిపబ్లిక్ డే హాలిడే వీకెండ్ కూడా సినిమాకు మరో పెద్ద అడ్వాంటేజ్.

ఇవన్నీ ఒక ఎత్తైతే అఖిల్ కూడా గతంలోలా కాకుండా తన సహనటులతోనూ..మీడియా వారితోనూ చక్కగా కలిసిమెలిసి ఉండడం కూడా ఒక పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. ప్రమోషన్స్ లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతోంది. అక్కినేని ఫ్యామిలీ హీరోలతో మాత్రమె కాకుండా ఎన్టీఆర్.. చరణ్ లాంటి హీరోలతో సన్నిహితంగా ఒక చిన్న తమ్ముడిలా మెలగడం కూడా ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో సినిమాకు మంచి టాక్ వస్తే మాత్రం సూపర్ హిట్ హిట్ కావడం ఖాయమే.