Begin typing your search above and press return to search.
'ఆచార్య' వైఫల్యానికి 'మెగా' జోక్యమే కారణమా..??
By: Tupaki Desk | 1 May 2022 10:00 AM ISTటాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్నారు కొరటాల శివ. రచయితగా కెరీర్ ప్రారంభించిన కొరటాల.. 'మిర్చి' సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. మొదటి నుంచీ సామాజిక నేపథ్యానికి తనదైన శైలిలో కమర్షియల్ హంగులు - ఎంటర్టైన్మెంట్ జోడించి ప్రేక్షకులకు మెప్పిస్తూ వస్తున్నారు.
హీరోల అభిమానులను మాత్రమే కాకుండా సామాన్య ప్రేక్షకులను కూడా సంతృప్తి పరిచేలా సినిమాలు తెరకెక్కించడం కొరటాల ప్రత్యేకత. ఈ క్రమంలోనే 'శ్రీమంతుడు' 'జనతా గ్యారేజ్' 'భరత్ అనే నేను' వంటి వరుస విజయాలను అందుకొని అగ్ర దర్శకుల్లో ఒకరిగా రాణిస్తున్నారు.
ప్రభాస్ - మహేష్ బాబు - ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో వర్క్ చేసిన కొరటాల.. మెగా తండ్రీకొడుకులు చిరంజీవి - రామ్ చరణ్ లను ఒకే స్క్రీన్ మీద చూపించే బాధ్యత తీసుకున్నారు. అయితే ఈ విషయంలో దర్శకుడు పూర్తిగా ఫెయిల్ అయ్యారనే కామెంట్స్ వస్తున్నాయి.
చిరంజీవి - చరణ్ ప్రధాన పాత్రల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆచార్య' చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ప్రీమియర్ షోల నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు రివ్యూలు కూడా అలానే వచ్చాయి.
ఏమాత్రం కొత్తదనం లేని కథ కథనాలతో దర్శకుడు ఇద్దరు మెగా హీరోలను ఎలా హ్యాండిల్ చేయాలని అనుకున్నారని అందరూ ఆశ్చర్యపోయారు. 'ఆచార్య' సినిమా కొరటాల కెరీర్ లోనే వీక్ సబ్జెక్ట్ అని అంటున్నారు. స్క్రిప్ట్ కంటే మెగా హీరోల స్టార్ వాల్యునే నమ్ముకున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.
నిజానికి స్వతహాగా రచయిత అయిన కొరటాల.. ఇప్పటి వరకు తనదైన శైలి రచనతో భారీ విజయాలను అందుకున్నారు. కానీ 'ఆచార్య' చూసిన తర్వాత అసలు ఇది కొరటాల సినిమానే.. అతనే డైరెక్ట్ చేశాడా? లేదా మెగా హీరోల ప్రభావం ఏమైనా ఉందా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం కొరటాల శివ రాసుకున్న కథకు.. తెర మీదకు సినిమాగా వచ్చిన స్టొరీకి మధ్య చాలా మార్పులు జరిగాయట. 'ఆచార్య' చిత్రంలో దర్శకుడు 15 నిమిషాలకు మించని ఓ ప్రత్యేక పాత్రను రాసుకొని.. మహేష్ బాబు చేత చేయించాలని అనుకున్నారట.
చిరు - చరణ్ లను ఒకే స్క్రీన్ మీద చూడాలనే సురేఖ కొణిదెల కోరిక మేరకు పట్టుబట్టి ఆ పాత్ర కోసం మెగా వారసుడిని ఎంపిక చేశారని.. దీంతో స్క్రిప్టులో మార్పులు చేసి సిద్ద పాత్రను 45 నిమిషాల పాటు ఉండేలా పొడిగించారని రూమర్స్ వస్తున్నాయి
రామ్ చరణ్ పాత్రను పొడిగించడం వల్ల సినిమా నిడివి పెరిగిపోవడంతో.. రన్ టైమ్ ను తగ్గించడానికి హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాత్రను పూర్తిగా తొలగించారని.. దీంతో ముందుగా అనుకున్న కథంతా మారిపోయిందని అనుకుంటున్నారు.
నిజానికి 'ఆచార్య' ట్రైలర్ రిలీజ్ డే వరకు కూడా మేకర్స్ ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ కు కాజల్ ను ట్యాగ్ చేస్తూ వచ్చారు. ఏప్రిల్ 12న ట్రైలర్ లాంచింగ్ టైం చెప్పే పోస్టర్ కు కూడా ఆమెను ట్యాగ్ చేశారు. అయితే ట్రైలర్ విడుదల తర్వాత హీరోయిన్ పేరుని ఎక్కడా ప్రస్తావించలేదు.
దీంతో కాజల్ అగర్వాల్ పాత్రకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ రోజు నిర్ణయం తీసుకొని ఉంటారని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 'ఆచార్య' మేకర్స్ మాత్రం కాజల్ తో నాలుగు రోజులు మాత్రమే షూట్ చేశామని.. హీరో పాత్ర ఔచిత్యం దెబ్బతింటుందని అప్పుడే హీరోయిన్ ను తొలగించారని పేర్కొన్నారు.
ఏదైతేనేం 'ఆచార్య' సినిమా ఈ ఫలితాన్ని అందుకోడానికి మెగా జోక్యమే కారణమని నెటిజన్లు అంటున్నారు. దీని వల్లనే కొరటాల శివ రాసుకున్న కథ - స్క్రీన్ ప్లే తప్పుదోవ పట్టాయని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ. మెగా మల్టీస్టారర్ మాత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనేది స్పష్టం అవుతోంది.