Begin typing your search above and press return to search.

నిజంగానే స‌ర్ ప్రైజ్ ఇచ్చిన‌ మోనాల్‌.. అఖిల్ తో ల‌వ్‌.. ప్రేమికుల రోజున ప్ర‌క‌ట‌న‌!

By:  Tupaki Desk   |   14 Feb 2021 5:29 PM IST
నిజంగానే స‌ర్ ప్రైజ్ ఇచ్చిన‌ మోనాల్‌.. అఖిల్ తో ల‌వ్‌.. ప్రేమికుల రోజున ప్ర‌క‌ట‌న‌!
X
టాలీవుడ్లో అల్లరి నరేష్ స‌ర‌స‌న‌ ‘సుడిగాడు', ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి’ వంటి చిత్రాల్లో న‌టించి క‌నువిందు చేసింది హీరోయిన్ మోనాల్ గ‌జ్జ‌ర్‌. అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు మొహ‌మాటం లేకుండా అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసిన‌ప్ప‌టికీ.. అవ‌కాశాలు మాత్రం పెద్ద‌గా రాలేదు. దీంతో.. తెలుగు తెర‌పై క‌నుమ‌రుగైందీ బ్యూటీ. అయితే.. అక‌స్మాత్తుగా బిగ్ బాస్‌-4లో ప్రత్య‌క్ష‌మైంది. అందులో ఈ అమ్మ‌డు చేసిన ర‌చ్చ అంద‌రికీ తెలిసిందే. అయితే.. తాజాగా ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఇన్ స్టాలో ఓ స‌స్పెన్స్ పోస్ట్ పెట్టిందీ బ్యూటీ. కానీ.. అందులో స‌స్పెన్స్ మెయింటెయిన్ చేసింది. దీంతో.. అదేంటో తెలుసుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించారు ఫ్యాన్స్‌.

బిగ్ బాస్ లో మొద‌ట అందరితో ఒకేవిధంగా.. స‌న్నిహితంగా ఉన్న మోనాల్‌.. ఆ త‌ర్వాత‌ అభిజీత్‌కు బాగా దగ్గరైంది. కొన్నాళ్లపాటు ట్రావెల్ చేశాక‌.. అత‌న్ని వ‌దిలేసి అఖిల్ సార్థక్‌తో క్లోజ్ అయింది. అప్పటి నుంచి అతడితోనే ఉంటూ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. ముద్దులు, హ‌గ్గుల‌తో ఓ రేంజ్ లో రెచ్చిపోయారు ఇద్ద‌రూ.

కాగా.. ఇన్‌స్టాగ్రామ్ లో శ‌నివారం మోనాల్ పెట్టిన‌‌ ఓ పోస్ట్‌.. ఆస‌క్తిని రేకెత్తించింది. ఫిబ్ర‌వ‌రి 14న మీ అంద‌రికీ బిగ్ స‌ర్ ప్రైజ్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించింది. ‘‘గాయ్స్.. ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. రేపు మధ్యాహ్నం బిగ్ సర్‌ప్రైజ్. వెయిట్ చేయండి’’ అంటూ రాసుకొచ్చింది మోనాల్‌. దీంతో.. అది ఏమై ఉంటుందా? అని తీవ్రంగా ఆలోచించారు ఫ్యాన్స్‌. తన లవ్ విష‌యం ఏమైనా చెప్తుందా.. లేదంటే.. సినిమా ఆఫ‌ర్‌ గురించి అప్డేట్ ఇస్తుందా? అని డిస్క‌స్ చేశారు.

చివ‌ర‌కు.. ప్రేమికులరోజు సాక్షిగా ఆ క్రేజీ అప్డేట్ ఇచ్చింది మోనాల్ గజ్జర్. అఖిల్ సార్థ‌క్ తో జంట క‌ట్ట‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది! అయితే.. అది నిజ జీవితంలో కాద‌ని, ఓ వెబ్ సిరీస్ కోస‌మ‌ని చెప్పి ఫ్యాన్స్ ను నీరుగార్చేసింది. ‘తెలుగు అబ్బాయి.. గుజరాత్ అమ్మాయి' అనే వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఇందులో వీళ్లిద్ద‌రూ ప్రేమికులుగా క‌నిపించ‌బోతున్నారు. ఇదే విష‌యాన్ని ఇలా వెల్ల‌డించింది మోనాల్‌!