Begin typing your search above and press return to search.
యంగ్ డైరెక్టర్ లో రియలైజేషన్!
By: Tupaki Desk | 19 Jun 2019 12:40 PM ISTఆరంభమే యూత్ ఫుల్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న ఓ యువదర్శకుడు వరుసగా పలు సినిమాలు తీసి హిట్లు కొట్టాడు. అందులో ఓ రెండు బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. ఆ క్రమంలోనే అతడు చిన్న సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. ఏడెనిమిది చోటా మోటా సినిమాలకు `సమర్పకుడు` అని అతడి పేరు పడింది.
సమర్పకుడు అంటే ఆషామాషీనా .. ఆ సినిమా ప్రమోషన్ సహా రిలీజ్ వరకూ ప్రతిదీ తనే చూడాలి. అలా ఆ సినిమా తీసిన వాళ్ల కంటే కొసరుగా తన పేరే ఎక్కువగా ప్రమోషన్స్ లో వినిపించేది. అయితే అలా సమర్పకుడు బ్రాండ్ ని ఉపయోగించుకున్నందుకు అదేమైనా తనకు కలిసొచ్చిందా.. అంటే రివర్సులో తేడా కొట్టిందనే పరిణామం చెబుతోంది. సమర్కుడు ట్యాగ్ వేసిన ఆ సినిమాలేవీ సక్సెస్ కాలేదు సరికదా డిజాస్టర్లు అయ్యాయి. దీంతో ఆ ప్రభావం సదరు యువదర్శకుడిపైనే ఎక్కువ పడింది. దర్శకుడిగా సక్సెస్ లో ఉన్నప్పుడు ఇలా నిర్మాత- సమర్పకుడు హోదాని ఎంజాచ్ చేయాలని అనుకుని బుక్కయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఎట్టకేలకు చేసిన తప్పు తెలిసింది. దీంతో అతడు మైండ్ సెట్ మార్చుకుని ప్రస్తుతం తాను దర్శకత్వం వహించే సినిమాపైనే పూర్తిగా దృష్టి సారించారని తెలుస్తోంది.
ఇటీవలే ఓ ఫ్లాప్ తీసాడు కాబట్టి తన కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోకుండా ఉండాలన్నా.. తన హోదాని కాపాడుకోవాలన్నా ఇప్పుడు కచ్ఛితంగా హిట్టు తీసి నిరూపించుకోవాల్సిన సన్నివేశం ఉందిట. దీంతో ఇతరత్రా సైడు వ్యాపకాలకు చెక్ పెట్టేసి పూర్తిగా తాను దర్శకత్వం వహించే సినిమాపైనే కాన్ సన్ ట్రేట్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ వారం రిలీజ్ కి వస్తున్న ఓ సినిమా అతడి పేరు మీదనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఎందుకనో సమర్పకుడు స్థానంలో టైటిల్ కార్డ్స్ లో ఆ పేరు లేదని తెలుస్తోంది. అంటే ఇకపై పాత తప్పులు చేయకూడదని నిర్ణయించుకుని ఇలా చేస్తున్నాడా? అన్నది చూడాలి. ఇంతకీ తనకు సమర్పకుడు ట్యాగ్ కలిసొచ్చిందా లేదా? అంటే అది పూర్తిగా నెగెటివ్ ఫలితాన్నే ఇచ్చిందని విశ్లేషించుకుని ఇలా మారిపోయాడన్న ముచ్చటా సాగుతోంది.