Begin typing your search above and press return to search.

ఆదిపురుష్‌ కి కూడా తప్పేలా లేదు

By:  Tupaki Desk   |   16 Feb 2022 12:30 PM GMT
ఆదిపురుష్‌ కి కూడా తప్పేలా లేదు
X
కరోనా ముందు వరకు పెద్ద హీరోల సినిమాలు చిన్న హీరోల సినిమాలు ఏవైనా కూడా ఒక తేదీ అనుకుంటే 90 శాతం అదే తేదీకి విడుదల అయ్యేవి. ఒకటో రెండే భారీ చిత్రాలు.. వివాదాస్పద చిత్రాలు వాయిదాలు పడేవి తప్పితే మెజార్టీ శాతం సినిమాలు అనుకున్న తేదీకి అనుకున్నట్లుగానే విడుదల అయ్యేవి. కాని కరోనా మొత్తం పరిస్థితులను మార్చేశాయి. గత రెండు సంవత్సరాలుగా ఏ ఒక్క సినిమా కూడా ముందుగా అనుకున్న తేదీకి రాలేక పోయాయి.

కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్‌.. హాలీవుడ్‌ సినిమాలకు కూడా వాయిదాలు తప్పలేదు. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్‌ సినిమా ఎన్ని సార్లు వాయిదా పడిందో తెల్సిందే. మొన్నటికి మొన్న సంక్రాంతి సందర్బంగా విడుదల చేయాలని ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. ఇంతలో కరోనా థర్డ్‌ వేవ్‌ రావడంతో ఉత్తర భారతం మొత్తం ఆంక్షల్లోకి వెళ్లిపోయింది. దాంతో విడుదల వాయిదా వేయడం జరిగింది.

కొత్త విడుదల తేదీని రాధేశ్యామ్‌ ప్రకటించారు. ఈ సారి విడుదలకు ఎలాంటి అవాంతరాలు లేకపోవచ్చు అని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. కాని ప్రేక్షకులు మాత్రం వచ్చినప్పుడు చూద్దాం అన్నట్లుగా లైట్‌ గా ఉన్నారు. ప్రభాస్ సినిమానే కాకుండా ఇంకా టాలీవుడ్ కు చెందిన పలు సినిమాలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. 2020 సంవత్సరంలో ఆదిపురుష్‌ సినిమా ను ఆగస్టుల 2022 లో విడుదల చేస్తామని ప్రకటించారు.

ఎన్ని సినిమాలపై కరోనా ఎఫెక్ట్‌ పడ్డా ఆదిపురుష్ సినిమా విడుదల తేదీ పై కరోనా ప్రభావం ఉండక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఆదిపురుష్ ఖచ్చితంగా ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల అవుతుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తేలిపోయింది.

ఆగస్టు 11వ తారీకున బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ అమీర్ ఖాన్‌ నటించిన లాల్ సింగ్‌ చద్దా విడుదల కాబోతున్నట్లుగా తాజాగా అధికారికంగా ప్రకటించారు. నాగ చైతన్య కీలక పాత్రలో కనిపించబోతున్న ఆ సినిమా మేకర్స్ ఆదిపురుష్‌ చిత్ర యూనిట్‌ సభ్యులతో చర్చించిన తర్వాతే ఆ తేదీని ఆక్రమించారని సమాచారం అందుతోంది. ఆదిపురుష్‌ మేకర్స్ ఆ తేదీని వదులుకునేందుకు సిద్దం అవ్వడం వల్లే లాల్‌ సింగ్ చద్దా ఆగస్టు 11న విడుదల కాబోతుందట.

ఆదిపురుష్ సినిమా ఇప్పటికే షూటింగ్‌ పూర్తి అయ్యి చాలా రోజులు అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటుంది. అయినా కూడా ఆగస్టును వదిలేసి కొత్త విడుదల తేదీకి షిప్ట్‌ అయ్యేందుకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 11 డేట్ ను వదిలేసిన ఆదిపురుష్ దసరా టార్గెట్‌ గా రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

దసరా వీక్ లో 5 రోజుల లాంగ్ వీకెండ్‌ ఉండటం వల్ల కలిసి వస్తుందనే ఉద్దేశ్యంతో ఆదిపురుష్ ను దసరాకు విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారట. అతి త్వరలోనే ఆదిపురుష్ కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే దసరాకు కూడా కొన్ని సినిమాలు ఫిక్స్ అయ్యి ఉన్నాయి. మరి ఆదిపురుష్ వల్ల ఆ సినిమాలు డిస్ట్రబ్‌ అయ్యే అవకాఆలు కనిపిస్తున్నాయి.