Begin typing your search above and press return to search.

రాధేశ్యామ్.. భారీ టార్గెట్ అక్కడే...?

By:  Tupaki Desk   |   20 Dec 2021 5:50 AM GMT
రాధేశ్యామ్.. భారీ టార్గెట్ అక్కడే...?
X
రాధేశ్యామ్ సంక్రాంతి రేసులో ఉన్న పాన్ ఇండియా మూవీ. ఈ సినిమా కోసం వెయిట్ చేసే ఆడియన్స్ కోట్లాది మంది ఉన్నారు. ప్రభాస్ తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ కంప్లీట్ లవర్ బాయ్ గా మారి నటిస్తున్న సినిమా అని టాక్ ఉంది. ఇక ప్రభాస్ ఇప్పటిదాకా యాక్షన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ సడెన్ గా జానర్ మార్చేశారు. రాధేశ్యామ్ క్యూట్ లవ్ స్టోరీ. ఒక విధంగా కూల్ గా ఈ మూవీ ఆద్యంతం సాగుతుంది అని అంటున్నారు.

సంక్రాంతి బరిలో నిలిచిచిన రాధేశ్యామ్ అసలైన వేడుకను తీసుకురావడానికి డేట్ టైమ్ ఎంచుకుని మరీ ముగ్గులోకి దిగుతోంది. ఈ మూవీలో సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. క్లాసిక్ టచ్ తోనే అవి సాగుతూ వీనులకు విందు చేస్తున్నాయి. అయితే ఇక్కడ కొంత మంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వారి సంక్రాంతి అంటే ఒక విధంగా రచ్చ రచ్చ చేస్తారు. ఎటు చూసినా హడావుడి మాస్ జాతరగా సాగుతుంది. అలాంటి టైమ్ లో వస్తున్న ఈ క్యూట్ లవ్ స్టోరీకి ఎంత వరకూ స్పేస్ ఉంటుంది అన్నదే ఆ డౌట్. ఒక వైపు చూస్తే మాస్, క్లాస్ ని మిక్స్ చేస్తూ ట్రిపుల్ ఆర్ వస్తోంది. మరో వైపు భీమ్లా నాయక్ మాస్ కి పూనకాలు తీచ్చేదే. మరి ఈ రెండింటినీ ఢీ కొడుతూ రాధేశ్యామ్ ప్రభాస్ ఎలా ఆడియన్స్ కి రీచ్ అవుతాడు అన్న చర్చ కూడా సాగుతోంది.

అయితే తెలుగు సంక్రాంతికి క్లాసిక్ టచ్ తో వస్తున్న ఒక అరుదైన ఫీస్ట్ గా రాధేశ్యామ్ ని చెబుతున్నారు. ఈ మూవీ కంటెంట్ అలాంటిదని, ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది అని కూడా మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఇక రాధేశ్యామ్ కి అసలైన టార్గెట్ కూడా ఉందిట. ఉత్తరాదిన ప్రభాస్ ఊపు మామూలుగా ఉండదు. అక్కడ ఖాన్స్ త్రయాన్ని నెట్టి మరీ ముందుకు దూసుకువచ్చిన పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ ఎక్కడో ఉన్నారు.

తెలుగులో ఫ్లాప్ అయిన సాహో అక్కడ బంపర్ హిట్. ఇక నార్త్ ఆడియన్స్ కి ఇట్టే పట్టేసే కంటెంట్ తోనే రాధేశ్యామ్ ఉందని, సో అక్కడ ఈ మూవీ దుమ్ము దులపడం ఖాయమని అంటున్నారు. తెలుగులో తన హిట్ ని ఎలాగూ సొంతం చేసుకుంటూనే బాలీవుడ్ లో కూడా నంబర్ వన్ గా రేసులో నిలిచి గెలిచే సత్తా రాధేశ్యామ్ కి ఉందని అంటున్నారు.

అందుకే అన్నీ చూసుకునే సరైన ముహూరంగా పెట్టుకుని డేట్ ఫిక్స్ చేసుకున్నారట. మొత్తానికి ప్రభాస్ మూవీ దాదాపుగా మూడేళ్ల తరువాత వస్తోంది. అంతే కాదు ఈ మూవీలో పూజా హెగ్డే గ్లామర్, మంచి మ్యూజిక్ ఇవన్నీ కూడా విజయ‌ సంకేతాలు అని అంటున్నారు. సో రాధేశ్యామ్ కోసం అంతా వెయింటింగ్ మరి.