Begin typing your search above and press return to search.

ఆమె సదా కాదు.. సదా సయిద్

By:  Tupaki Desk   |   24 Sept 2017 11:19 AM IST
ఆమె సదా కాదు.. సదా సయిద్
X
మొదటి సినిమాతోనే వి'జయం' పొందిన భామ సదా. ఆ సినిమాలో వెళ్లవయ్యా వెళ్ళూ.. అనే డైలాగ్ ఇప్పటికి కూడా చాలా ఫెమాస్ అని చెప్పాలి. తన నటనతో ఈ అమ్మడు మొదట్లో బాగానే ఆఫర్లను దక్కించుకుంది. ముఖ్యంగా శంకర్ లాంటి గొప్ప దర్శకుడి దృష్టిలో పడి అపరిచితుడు అనే సినిమాలో ఛాన్స్ దక్కించుకొని ఇండస్ట్రీ హిట్ సినిమాలో భాగమైంది.

అయతే ఆ తరవాత అక్కడక్కడా స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ వచ్చినా అమ్మడికి అవకాశాలు అంతగా దక్కలేదు. దీంతో బుల్లితెరపై డ్యాన్సు షోల్లో తన జడ్జిమెంట్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా డి షో ద్వారా ఆమె చాలా ఫేమస్ అయ్యింది. అయితే ఆమెకు ఇంకా నటనకు దూరం అవ్వలేదు అంటోంది. మళ్లీ హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకు అమ్మడు జాతకాలు చాలా తిరగసిందట. ఫైనల్ గా ఆస్త్రాలజీ ప్రకారం తన పేరులో మార్పులు చేస్తే తప్పకుండా అదృష్టం ఆమె అందానికి హెల్ప్ అవుతుందని డిసైడ్ అయ్యిందట. మొన్నటి వరకు సదా అని పిలవబడిన ఈ జయం భామా ఇప్పుడు సదా సయిద్ అని పిలిపించుకోవడానికి సిద్దమైందట. 33 ఏళ్ల వయసులో పెరు మార్చుకున్న సదా అసలు పేరు సదాఫ్ మహమ్మద్ సయిద్. కానీ జయం సినిమా నుంచి సదా ఆని స్క్రీన్ నేమ్ మార్చుకుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తన పేరును మార్చుకుంది. ఇప్పటికే తన పీఆర్ లకి కి కూడా ప్రమోట్ చేయమని సదా తెలిపిందట.

సాధారణంగా సినీ తారలు ఇలాంటి వాటిని చాలా నమ్ముతారు. తమన్నా కూడా తన నేమ్ లో ఒక ఆంగ్ల అక్షరాన్ని జత చేయగా.. రకుల్ ఒక వర్డ్ ని తీసేసి చేతికి ఒక రింగ్ పెట్టుకుంది. అవకాశాలు రావాలంటే అదృష్టం ఉండాలి. సో తరాలు ఈ విధమైన నమ్మకాలతో ముందుకు వెళుతున్నారు. మరి అందరిలనే సదా కి కూడా ఈ దారి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.