Begin typing your search above and press return to search.

రీల్ విల‌న్ రియ‌ల్ కోణం తెలిస్తే అవాక్కే!

By:  Tupaki Desk   |   8 Jun 2019 6:33 AM GMT
రీల్ విల‌న్ రియ‌ల్ కోణం తెలిస్తే అవాక్కే!
X
విల‌న్ గా అంద‌రికి సుప‌రిచితుడు ఆశిష్ విద్యార్థి. టాలీవుడ్ లో విల‌న్ గా ఆయ‌న చేసిన సినిమాలెన్నో. క‌ర్క‌స ప్ర‌తినాయ‌కుడిగానే కాదు.. చెడ్డ పోలీసుగా.. కామెడీ విల‌న్ గా ఆయ‌న చేసిన పాత్ర‌లు తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించాయి. ఆశిష్ విద్యార్థి ట్రాక్ చూస్తే ఆశ్చ‌ర్యానికి గురి కాక మాన‌దు. ఎందుకంటే.. 11 భాష‌ల్లో ఇప్ప‌టికి ఆయ‌న 230 సినిమాల్లో న‌టించారు.

నెల‌లో 19 రోజులు త‌న‌ది సూటుకేసు జీవితంగా ఆయ‌న త‌న గురించి చెప్పుకుంటారు. పుట్టింది కేర‌ళ‌లో అయినా.. పెరిగింది ఢిల్లీలో అని.. ఉంటున్న‌ది మాత్రం ముంబ‌యిలో అని చెప్పే ఆశిష్ విద్యార్థిలో చాలాతక్కువ మందికి మాత్ర‌మే తెలిసిన మ‌రో కోణం ఉంది. సినిమాల్లో ఫుల్ బిజీగా ఉండే ఆశిష్ విద్యార్థిలో ఒక వ్య‌క్తిత్వ వికాస నిపుణుడు ఉన్నారు. సినిమాల‌తో పాటు ఆయ‌న వ్య‌క్తిత్వ వికాస నిపుణుడిగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. విప్రో.. ఓల్టాస్ లాంటి ప్ర‌ముఖ సంస్థ‌ల్లో ప‌ని చేసే ఉద్యోగుల‌కు వ్య‌క్తిత్వ వికాస పాఠాల్ని బోధిస్తుంటారు. జీవితంలో ఎలా మ‌సులుకోవాలి.. ఒడిదొడుకుల్ని ఎలా ఎదుర్కోవాల‌న్న విష‌యాల్ని ఆయ‌న చెబుతుంటారు. రీల్ లో విల‌న్ గా క‌నిపించే ఆశిష్ విద్యార్థి రియ‌ల్ లైఫ్ లో ఆయ‌నకు సంబంధించిన ఈ అంశం చాలా త‌క్కువ‌మందికి తెలుస‌ని చెప్పాలి.