Begin typing your search above and press return to search.

అలుపెరుగని రియల్ హీరో.. వీడియో వైరల్!

By:  Tupaki Desk   |   28 April 2021 4:00 PM GMT
అలుపెరుగని రియల్ హీరో.. వీడియో వైరల్!
X
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ఆ మహమ్మారిని కట్టడి చేయడానికి గతేడాది కాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతర చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. కానీ రోజురోజుకి లక్షల్లో కరోనా కేసులు నమోదు అవుతుండగా.. వేలసంఖ్యలో మరణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో దేశప్రజలు దిక్కుతోచని స్థితిలో అవస్థలు పడుతున్నారు. కానీ ఎంతమంది ఎన్ని సేవలు చేసినా ఎన్ని సహాయ చర్యలు తీసుకున్నా స్టార్ యాక్టర్ సోనూసూద్ చేసిన సేవలు ఎవరు చేయలేరు. సినిమాల్లో విలన్ అయినప్పటికీ నిజజీవితంలో మాత్రం సోనూసూద్ సహాయం పొందినవారి మదిలో దేవుడు అయిపోయాడు.

దేశప్రజల దృష్టిలో అతనొక గొప్ప మానవతావాదిగా నిజమైన హీరో. గతేడాది కాలంగా తనకు చేతనైంది సాయం చేస్తూ.. అడిగిన ప్రతి ఒక్కరికి కాదనకుండా సేవలు అందిస్తూనే ఉన్నాడు. ఈ విషయంలో దేశం మొత్తం సోనూసూద్ ను కొనియాడుతూనే ఉంది. కానీ ఇప్పటికి సోను సేవలు చేయడంలో ఎలాంటి ఆలోచన లేకుండా సహాయం చేస్తూనే ఉన్నాడు.. సోషల్ మీడియాలో సహాయం కోరిన వారికీ రెస్పాండ్ అవుతున్నాడు. అసలు విషయం ఏంటంటే.. సోనూసూద్ కరోనా బారినపడి కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించి బాధితులకు సహాయం అందించాడు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కంట్రోల్ కాకపోవడంతో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో ఈ విషయంలో ఆయనకి అభ్యర్థనలు అందుతున్నాయని వీడియో చూపించాడు. ప్రస్తుతం సోను వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.