Begin typing your search above and press return to search.
భారీ యాక్షన్ తో క్వీన్ కంగన దుమారానికి రెడీ
By: Tupaki Desk | 4 Jan 2021 3:15 PM IST2020 ఆద్యంతం క్వీన్ కంగన ఫైరింగ్ గురించి తెలిసినదే. వివాదాలతో సహజీవనం తన జన్మహక్కు అని నిరూపించింది క్వీన్. ఒకానొక సమయంలో శివసేనతో గొడవకు దిగి తల దాచుకునేందుకు సిమ్లాలోని తన సొంత ప్లేస్ కి వెళ్లిపోవాల్సి వచ్చింది.
అదంతా గతం అనుకుంటే వర్తమానంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ కంగన దుమారం రేపుతోంది. ఇప్పటికే జయలలిత బయోపిక్ తలైవి చిత్రీకరణను ముగించి.. తదుపరి ధాకడ్ లాంటి భారీ యాక్షన్ సినిమాలో నటించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
తాజాగా ధాకడ్ చిత్ర బృందంతో కలిసిన కంగన ముంబైకి తిరిగి వచ్చింది. ఆమె కుటుంబ సభ్యులకు ఆమె రాబోయే చిత్రం ధాకాడ్ బృందం కోసం ఒక ప్రత్యేక బ్రంచ్ సిద్ధం చేయడం ఆసక్తికరం. కంగన తన సోషల్ మీడియా హ్యాండిల్ లోని చిత్రాలు వీడియోలు తాజాగా బయటపడ్డాయి. కంగనా రనౌత్ తో పాటు అర్జున్ రాంపాల్- దిగ్గజ అంతర్జాతీయ సినిమాటోగ్రాఫర్ టెట్సువో నాగట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అర్జున్ రాంపాల్ రాబోయే హై-ఆక్టేన్ యాక్షన్ చిత్రం ధాకడ్ లో కంగనా రనౌత్ తో స్క్రీన్ స్థలాన్ని పంచుకుంటున్నానని ఇదివరకూ ధృవీకరించాడు.
రజీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. మహమ్మారి సమయంలో టెట్సువో నాగట్ లాంటి సినిమాటోగ్రాఫర్ ని బరిలో దించడం ఆసక్తికరం. ధాకాడ్ పూర్తి బృందం యొక్క అంకితభావం కృషిని మాత్రమే చూపిస్తుందని టీమ్ ప్రకటించింది. ధాకాడ్ పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. భారతీయ సినిమా చరిత్రలో ఇదో భిన్నమైన భారీ యాక్షన్ చిత్రమని టీమ్ చెబుతోంది.
దర్శక నిర్మాతలు గత సంవత్సరం టీజర్ ను విడుదల చేయగా కంగనా మెషిన్ గన్స్ చేతపట్టి కాల్పులు జరిపుతున్న వైనం హీట్ పెంచింది. కంగనా భీకర అవతారం అగ్గి రాజేసింది. ఆమె M4 కార్బైన్ గన్ తో వెనుక వైపుగా కాల్చడం కనిపించింది. ప్రస్తుతం అర్జున్ రాంపాల్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరయ్యాడు. అతన్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) రెండుసార్లు పిలిచింది. రెగ్యులర్ చిత్రీకరణకు అతడు కూడా జాయిన్ కావాల్సి ఉంటుంది.