Begin typing your search above and press return to search.

కామెడీ చేయలేక దర్శకత్వం చేసేందుకు రెడీ!?

By:  Tupaki Desk   |   2 Dec 2020 2:04 PM IST
కామెడీ చేయలేక దర్శకత్వం చేసేందుకు రెడీ!?
X
కమెడియన్‌ గా దశాబ్దం పాటు వెలుగు వెలిగిన సునీల్‌ హీరోగా ఆఫర్‌ రావడంతో అటు టర్న్‌ తీసుకున్నాడు. అయితే హీరోగా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ అవ్వలేక పోయాడు. దాంతో మళ్లీ కమెడియన్‌ గా సినిమాల్లో నటించేందుకు సిద్దం అయ్యాడు. హీరోగా నటించిన సునీల్‌ మళ్లీ కమెడియన్‌ గా చేయలేక పోతున్నాడు. కమెడియన్‌ సక్సెస్‌ అవ్వలేక పోయిన సునీల్‌ అటు హీరోగా చేయలేక విలన్‌ పాత్రలకు ఇంట్రెస్ట్‌ చూపించాడు. హీరోగా.. విలన్‌ గా.. కమెడియన్‌ గా ఇలా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న సునీల్‌ మరో వైపు దర్శకుడిగా కూడా ప్రయత్నించేందుకు సిద్దం అవుతున్నాడు.

ప్రస్తుతం హీరోగా వీఎన్‌ ఆధిత్య దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న సునీల్‌.. అల్లు అర్జున్‌ హీరోగా రూపొందుతున్న పుష్ప సినిమాలో విలన్‌ గా కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరో వైపు ఒకటి రెండు సినిమాల్లో కమెడియన్‌ గా కూడా కనిపించబోతున్నాడు. ఈ సమయంలోనే సునీల్‌ ఒక మరాఠీ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసేందుకు సిద్దం అయ్యాడట. సన్నిహితుడితో కలిసి సునీల్‌ ఆ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించబోతున్నాడట.

హీరోగా కూడా సునీల్‌ కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తన సినిమాకు తానే దర్శకుడిగా వ్యవహరించబోతున్నాడన్నమాట. దర్శకుడిగా సునీల్‌ సక్సెస్‌ అయితే ఇక నటనకు స్వస్థి చెప్తాడేమో అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీఎన్‌ ఆధిత్య దర్శకత్వంలో చేస్తున్న సినిమాను పూర్తి చేసిన తర్వాత సొంత సినిమాను సునీల్‌ మొదలు పెట్టే అవకాశం ఉందంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.