Begin typing your search above and press return to search.

శ్యామ్ సింగ‌రాయ్` ట్రైల‌ర్ రిలీజ్‌కి అంతా సిద్ధం

By:  Tupaki Desk   |   13 Dec 2021 1:12 PM IST
శ్యామ్ సింగ‌రాయ్` ట్రైల‌ర్ రిలీజ్‌కి అంతా సిద్ధం
X
టాలీవుడ్ లో ఏ స్టార్ ని క‌దిలించినా వినిపిస్తున్న మాట పాన్ ఇండియా.. ప్ర‌తీ హీరో ఇప్పుడు ఇదే జ‌పం చేస్తున్నారు. ప్ర‌భాస్ నుంచి తేజ స‌జ్జ వ‌ర‌కు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా వున్నారు. ఈ వ‌రుస‌లో నేచుర‌ల్ స్టార్ నాని కూడా పాన్ ఇండియా మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నాడు.

నాని న‌టిస్తున్న తాజా చిత్రం `శ్యామ్ సింగ రాయ్‌`. నాని నుంచి వ‌స్తున్న తొలి పాన్ ఇండియా స్థాయి మూవీ ఇది. `టాక్సీ వాలా` ఫేమ్ రాహుల్ సంక్రీత్య‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నిహారిక ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై వెంక‌ట్ బోయిన ప‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హైలీ టాలెంటెడ్ హీరోయిన్స్ సాయి ప‌ల్ల‌వి, కృతిశెట్టి.. `ప్రేమ‌మ్‌` ఫేమ్ మ‌డోన్నా సెబాస్టియ‌న్ ఇందులో హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌లై టాక్ ఆప్ ది ఇండ‌స్ట్రీగా మారిన విష‌యం తెలిసిందే.

ఈ మ‌గ‌ళ‌వారం అంటే డిసెంబ‌ర్ 14న ఈ చిత్ర ట్రైల‌ర్ ని చిత్ర బృందం వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హించ‌నున్న రాయ‌ల్ ఈవెంట్‌లో విడుద‌ల చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌న్నీ సిద్ధం అయ్యాయి. భారీ స్థాయిలో జ‌ర‌గ‌నున్న ఈ ఈవెంట్‌లో చిత్ర బృందం అంతా పాల్గొన‌బోతోంది.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్ లో కోల్ క‌తా నేప‌థ్యంలో ఈ సినిమా సాగుతుంద‌ని, రెండు జ‌న్మ‌ల నేప‌థ్యంలో క‌థ న‌డుస్తుంద‌ని, ఓ పాత్ర కోల్‌క‌తాలో దేవ‌దాసీ వ్య‌వ‌స్థ‌కు వ్య‌తిరేకంగా ఫైట్ చేస్తాడ‌ని క్లారిటీ వ‌చ్చేసింది.

దీంతో ఈ సినిమాపై స‌హ‌జంగానే అంచ‌నాలు పెరిగిపోయాయి. టీజ‌ర్ లోనే క‌థ‌ని కొంత వ‌ర‌కు రివీల్ చేసిన మేక‌ర్స్ ట్రైల‌ర్ లో ఎలాంటి ట్విస్ట్ ల‌ని ప్లాన్ చేశారా? అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

స‌త్య‌దేవ్ జంగా క‌థ అందించిన ఈ చిత్రంలో రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ముర‌ళీ శ‌ర్మ‌, జిష్సు సేన్ గుప్తా, లాలీ సామ్స‌న్‌, మ‌నీష్ వాద్వా, బారున్ చందా, అభిన‌వ్ గోమ‌ఠం కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందిస్తున్న ఈమూవీ ఈ నెల 24న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సంచ‌ల‌నాలు సృష్టించాల‌న్న నేచుర‌ల్ స్టార్ నాని క‌ల ఎంత వ‌ర‌కు నెర‌వేరుతుందో తెలియాలంటే ఈ నెల 24 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.