Begin typing your search above and press return to search.
వెబ్ సిరీస్ లో ఇలియానా సంచలనాలకు సిద్ధం?
By: Tupaki Desk | 10 Jun 2023 8:00 AMసినిమా లతో పాటు ఇప్పుడు వెబ్ సిరీస్ ల వెల్లువ కొనసాగుతోంది. పెద్ద తెర కంటెంట్ తో పోలిస్తే ఓటీటీ లో ప్రయోగాల కు ఆస్కారం ఎక్కువ.. పైగా పాత్రల్లో ఘాడత పరంగా.. ఎంచుకున్న కథ లో ఎమోషన్ పరంగా ఓటీటీ కంటెంట్ అద్భుతాలు చేస్తోంది అంతగా నియమ నిబంధనలు వర్తించకపోవడంతో చెలరేగి నటించేందుకు తారల కు ఆస్కారం ఉంది.
ఇంతకుముందు ఫ్యామిలీ మ్యాన్ 1 లో ప్రియమణి ప్రయోగాత్మక పాత్ర లో నటించి మెప్పించగా.. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో సమంత శ్రీలంక టెర్రరిస్టు పాత్ర తో మెప్పించింది. నిజాని కి ఆ ఇద్దరికీ వెబ్ ఈ సిరీస్ కెరీర్ పరంగా బిగ్ బ్రేకింగ్ ఎలిమెంట్ గా మారింది. సమంత తరహా లోనే రాజ్ అండ్ డీకే తో కలిసి రాశీఖన్నా ప్రయోగాత్మక వెబ్ సిరీస్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. సీనియర్ నాయిక రాధి కా పండిట్.. కియరా అద్వాణీ ఆరంగేట్రమే వెబ్ సిరీస్ లో ప్రయోగాత్మక పాత్ర లతో మెప్పించారు. వీరి బాట లోనే తమన్నా-కాజల్-కీర్తి సురేష్-లావణ్య త్రిపాఠి వెబ్ సిరీస్ లతో ప్రయోగాల కు సిద్ధమవుతున్నారు.
ఇలా అందాల కథానాయికలంతా వెబ్ సిరీస్ లతో సత్తా చాటారు.. అదే బాటలో ఇప్పుడు ఇలియానా బిగ్ గేమ్ ప్లాన్ తో సిద్ధంగా ఉందని సమాచారం. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న ఇలియానా ... ప్రసవాని కి ముందే ఓ క్రేజీ వెబ్ సిరీస్ తో ఎంట్రీ ఇస్తుందిట. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిందని.. 2023 చివరి లో ఈ సిరీస్ ని స్ట్రీమింగు కి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నిర్మాత ఆషి దువా వెల్లడించారు. అలాగే ఈ వెబ్ సిరీస్ నాయికా ప్రధాన పాత్రలో ఇలియానా కు నటిగా స్కోప్ పెరుగుతుందని తెలిపారు.
ఇంకా పేరు పెట్టని వెబ్ సిరీస్ పై ఇప్పుడే అన్ని వివరాల్ని వెల్లడించలేమని తెలిపారు. వెబ్ సిరీస్ నిర్మాత ఆషి దువా మాట్లాడుతూ- సిరీస్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశ లో ఉంది. కాబట్టి సంవత్సరం చివరి నాటి కి ఈ సిరీస్ తో పాటు.. నేను నిర్మించిన మరో షో కూడా బయటకు వస్తుందని ఆశిస్తున్నాను. BBC స్టూడియోస్ తో కలిసి అప్లాజ్ ఎంటర్ టైన్ మెంట్ వీటిని నిర్మించింది. అని తెలిపారు.
"ఇలియానా పాత్ర గురించి మాట్లాడుతూ- ఇలియానా అద్భుతమైన పాత్ర లో నటించింది. తనను బర్ఫీలో చూసినట్లు గుర్తుంది! ఆ పాత్రతో పూర్తిగా ప్రేమ లో పడ్డాను. ఇప్పుడు అంతకంటే ప్రయోగాత్మక పాత్రతో సర్ ప్రైజ్ చేస్తుంది" అని వెల్లడించారు ఈ సిరీస్ కి కరిష్మా కోహ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. కరిష్మా - ఇలియానా ఇద్దరితో కలిసి పనిచేయడం చాలా గొప్ప అనుభవమని ... ఈ సిరీస్ లో ఇలియానా అద్భుతంగా నటించిందని.. ప్రపంచం ఆశ్చర్యపోయేలా కంటెంట్ ఉంటుందని తెలిపారు. అయితే ఈ సినిమా లో ఇలియానా హిజ్రా గా ప్రయోగాత్మక పాత్ర లో కనిపిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీని కి అధికారికంగా కన్ఫర్మేషన్ లేదు.