Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌ : ఇది మరీ ఓవర్‌ గురూ

By:  Tupaki Desk   |   1 Feb 2019 8:16 AM GMT
కేజీఎఫ్‌ : ఇది మరీ ఓవర్‌ గురూ
X
గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నడ చిత్రం 'కేజీఎఫ్‌' విడుదలైన అన్ని చోట్ల కూడా భారీ వసూళ్లను రాబట్టింది. కన్నడ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయంను లిఖించిన కేజీఎఫ్‌ తెలుగులో కూడా భారీగానే షేర్‌ ను రాబట్టింది. హిందీ మరియు తమిళంలో కూడా ఈ చిత్రం రాబట్టిన కలెక్షన్స్‌ చూసి ట్రేడ్‌ వర్గాల వారు షాక్‌ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా ఈ చిత్రం 225 కోట్ల వసూళ్లను ఈ చిత్రం నమోదు చేసినట్లుగా అధికారికంగా లెక్కలు చెబుతున్నారు. ఓవర్సీస్‌ లో ఈ చిత్రం 8 లక్షల డాలర్లను వసూళ్లు చేసింది. మిలియన్‌ మార్క్‌ కు కాస్త తేడాతో పోయింది.

ఇప్పుడు ఓవర్సీస్‌ లో ఇండియన్‌ సినిమాల సందడి లేదు. హిందీ, తెలుగు, తమిళం ఇలా ఏ భాషకు చెందిన సినిమాలు కూడా అక్కడ పెద్దగా ఆడటం లేవు. అక్కడి ఇండియన్‌ ప్రేక్షకులు సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో 'కేజీఎఫ్‌' ను మళ్లీ రిలీజ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేజీఎఫ్‌ చిత్రంకు అక్కడ మెల్ల మెల్లగా ఆధరణ పెరుగుతున్న సమయంలో ఇతర సినిమాలు రావడంతో తొలగించడం జరిగిందట. సినిమా చూడాలని ప్రేక్షకులు అనుకుంటుండగా తీసేశారనే టాక్‌ వచ్చిందని, అందుకే మళ్లీ అక్కడ రీ రిలీజ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా డిస్ట్రిబ్యూటర్లు చెబుతన్నారు.

ఒకప్పుడు ఇండియాలో సినిమాలు రీ రిలీజ్‌ అయ్యేవి. నెల రెండు నెలల గ్యాప్‌ లో సినిమాలు వచ్చేవి. కాని ఇప్పుడు ఓవర్సీస్‌ లో కేజీఎఫ్‌ ను రీ రిలీజ్‌ చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమా విషయంలో కూడా ఇలా జరగలేదు. ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌ లో ఈ సినిమా వచ్చింది. ఇంకా ఓవర్సీస్‌ లో ఎవరు చూస్తారని ఈ చిత్రాన్ని విడుదల చేస్తారంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. మిలియన్‌ మార్క్‌ కు బ్యాలన్స్‌ ఉన్న ఆ రెండు లక్షల డాలర్ల కోసం ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారేమో అనేది కొందరి వాదన. మొత్తానికి కేజీఎఫ్‌ నిర్మాతలు, ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూటర్‌ చేస్తున్న ఈ ప్రయత్నంను అక్కడి ప్రేక్షకులు ఎలా ఆధరిస్తారో చూడాలి.