Begin typing your search above and press return to search.

#RC15 ఆరునూరైనా ఫిబ్ర‌వ‌రిలో సెట్స్ కి!

By:  Tupaki Desk   |   21 Jan 2022 9:30 AM GMT
#RC15 ఆరునూరైనా ఫిబ్ర‌వ‌రిలో సెట్స్ కి!
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఆర్.సి 15 చితీక‌ర‌ణ సాగుతున్న సంగ‌తి తెలిసిందే.

కియ‌రా క‌థానాయిక‌. క‌రోనా క్రైసిస్ కొన‌సాగుతున్నా కానీ శంక‌ర్ త‌న టీమ్ తో ప‌నిని ఆపేందుకు సిద్ధంగా లేరు. చిన్న బ్రేక్ త‌ర్వాత తిరిగి కొత్త షెడ్యూల్ ని ప్రారంభించ‌నున్నార‌ని తెలుస్తోంది.

ఫిబ్రవరి రెండో వారంలో ఓ పాట చిత్రీకరణను పూర్తి చేస్తారు.

ఈ చిత్రం లో చ‌ర‌ణ్ యువ నాయ‌కుడిగా న‌టిస్తార‌ని ముఖ్య‌మంత్రి గా మారే ఐఏఎస్ అధికారిగా మెరుపులు మెరిపిస్తార‌ని కియ‌రా పాత్ర‌కు అంతే ప్రాధాన్య‌త ఉంటుంద‌ని తెలుస్తోంది.

శంక‌ర్ తో తొలిసారిగా అద్భుత అవ‌కాశం ద‌క్కింద‌న్న ఉత్సాహంతో చ‌ర‌ణ్ డ‌బుల్ హార్డ్ వ‌ర్క్ చేసేందుకు సంసిద్దంగా ఉన్నారు.

కోవిడ్ క్రైసిస్ ఓవైపు శంక‌ర్ కోర్టు స‌మ‌స్య‌లు మ‌రోవైపు ఇబ్బందిక‌రంగా మారాయి.

శంక‌ర్ లాంటి ఇండియా మోస్ట్ అవైటెడ్ ద‌ర్శ‌కుడితో ప‌ని చేస్తున్నందుకు సునీల్.. కియ‌రా లాంటి తార‌లు ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా ఉన్నారు.

నవీన్‌ చంద్ర- అంజలి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు- శిరీష్ లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయనున్నారు.